ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లో పలు భాషల్లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ షూటింగ్ ముంబై లో శరవేగంగా జరుపుకుంటుంది. ప్రభాస్ కూడా ఆదిపురుష్ షూటింగ్ కోసం ముంబై లోనే స్టే చేసారు. ప్రస్తుతం ఆదిపురుష్ షూటింగ్ చివరి షెడ్యూల్ చిత్రీకరణలో ఉంది. ఇప్పటికే జానకి పాత్రధారి కృతి సనన్, అలాగే రావణ్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ పాత్రల షూటింగ్ కంప్లీట్ అవడం.. సెట్స్ లో సెలెబ్రేట్ చేసుకోవడం కూడా పూర్తి అయ్యింది. ఇక ప్రభాస్ పార్ట్ షూటింగ్ కూడా త్వరలోనే కంప్లీట్ కాబోతున్నట్టుగా టాక్ ఉంది.
అయితే తాజాగా ఆదిపురుష్ సెట్స్ లో ఓ సెలబ్రేషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఆదిపురుష్ సినిమా స్టార్ట్ అయినప్పుడే ముంబైలోని మధ ద్వీపంలో ఆదిపురుష్ యాక్షన్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల డేట్స్‌ను బట్టి షూటింగ్‌ను జరుపుతున్నారు. ఇప్పుడు ఈ సినిమా యాక్షన్ పార్ట్ షూటింగ్ అరుదైన మైలురాయిని చేరుకుందని తెలుస్తోంది. ఆదిపురుష్ యాక్షన్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తై ఇప్పటికి వంద రోజులు పూర్తవడంతో ఆదిపురుష్ టీం సెట్స్ లో సెలెబ్రేషన్స్ చేసుకుంది అని... అందులో ప్రభాస్ అండ్ జానకి పాత్రధారి కృతి సనన్ కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. మరి వచ్చే ఏడాది ఆగష్టు లో రిలీజ్ కాబోతున్న ఆదిపురుష్ కి విఎఫ్ఎక్స్ కీలకం అని, వాటి కోసమే వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని టాక్.