Advertisementt

పిక్ టాక్: కొడుకులతో యంగ్ టైగర్

Thu 04th Nov 2021 08:53 PM
young tiger ntr,ntr,tarak,bhargav ram,abhay ram,ntr family  పిక్ టాక్: కొడుకులతో యంగ్ టైగర్
Pic Talk: Ntr with his sons పిక్ టాక్: కొడుకులతో యంగ్ టైగర్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ స్టార్స్ లో మహేష్ అలాగే అల్లు అర్జున్ తన ఫ్యామిలీ ని పబ్లిక్ ఈవెంట్స్ కి తీసుకుని వెళ్లడం, అలాగే అందరికి తెలిసేలా వెకేషన్స్ కి వెళ్లడం, తరచూ ఫ్యామిలీ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కానీ యంగ్ టైగర్ మాత్రం ఎక్కువగా భార్య లక్ష్మి ప్రణతిని, పిల్లలు, భార్గవ్ రామ్, అభయ్ రామ్ లను పబ్లిక్ గా ఫోకస్ అవ్వనివ్వడు. లో ప్రొఫైల్ మెయింటింగ్ చేసే ఎన్టీఆర్.. తన కొడుకులని ఎక్కువగా ఫ్రేమ్ లోకి రానివ్వడు. చాలా తక్కువగా దర్శనమిచ్చే ఎన్టీఆర్ ఫ్యామిలీ.. తాజాగా దివాళి సెలెబ్రేషన్స్ లో భాగంగా ఫొటోలకి ఫోజులిచ్చారు. కొడుకులు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లతో ఎన్టీఆర్ దిగిన పిక్ ని దివాళి స్పెషల్ గా అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేసాడు ఎన్టీఆర్.

కొడుకులిద్దరూ ఫెస్టివల్ డ్రెస్ లో చాలా ముద్దుగా కనిపిస్తున్నారు. పెద్దవాడు కాస్త డీసెంట్ గా కనిపిస్తుంటే.. చిన్నవాడు మాత్రం అల్లరి పిల్లవాడిలా కనిపిస్తున్నాడు. అమూల్ బేబీ లా ఎన్టీఆర్ చిన్న కొడుకు చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ ఈ మధ్యన ఓ షో లో తన చిన్న కొడుకు అల్లరి భరించడం చాలా కష్టం అని చెప్పాడు కూడా. తాజాగా ఎన్టీఆర్ తన కొడుకులతో ఫెస్టివ్ డ్రెస్సులతో దివాళీ రోజున షేర్ చేసిన పిక్ చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

Pic Talk: Ntr with his sons :

Pic Talk: Young Tiger Ntr and his Sons

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ