Advertisementt

శృతి హాసన్ పిక్ పై ట్రోల్స్

Fri 05th Nov 2021 10:33 AM
shruti haasan,nbk107,balakrishna,mythri movie makers,salaar pan india movie,prabhas heroine,shruti haasan pic  శృతి హాసన్ పిక్ పై ట్రోల్స్
Trolls on Shruti Haasan Pic శృతి హాసన్ పిక్ పై ట్రోల్స్
Advertisement
Ads by CJ

నిన్న దివాళీ స్పెషల్ గా మైత్రి మూవీస్ వారు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే NBK107 లో బాలకృష్ణ సరసన నటించబోయే హీరోయిన్ ని ఆహ్వానిస్తూ పిక్ రిలీజ్ చేసారు. బాలకృష్ణ సరసన శృతి హాసన్ నటిస్తున్నట్లుగా మైత్రి మూవీ మేకర్స్ ఆమె పిక్ ని వదులుతూ NBK107 లోకి ఆహ్వానించారు. అయితే మైత్రి మూవీస్ వారు వదిలిన శృతి హాసన్ పిక్.. ఒరిజినల్ కాదు.. ఆమె ని సలార్ మూవీ సెట్స్ లోకి ఆహ్వానిస్తూ సలార్ మేకర్స్ రిలీజ్ చేసిన లుక్. ప్రభాస్ సరసన శృతి హాసన్ సలార్ పాన్ ఇండియా ఫిలిం లో నటిస్తుంది. ఆమెని సెట్స్ లోకి ఆహ్వానిస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పిక్ ని మైత్రి వారు NBK107 కోసం వాడేశారు.

NBK107 మేకర్స్ సలార్ శృతి హాసన్ పిక్ నే కలర్ షేడ్ మార్చేసి NBK107 కోసం వాడెయ్యడంతో.. నెటిజెన్స్ శృతి హాసన్ పిక్ పై కామెడీ కామెంట్స్ చేస్తున్నారు. మైత్రి వారికి శ్రుతీ హాసన్ కొత్త పిక్స్ దొరకలేదా.. మరీ చీప్ గా పాన్ ఇండియా మూవీ సలార్ పిక్ ని వాడేశారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో శృతి హాసన్ NBK107 పిక్ పై మీమ్స్ మీద మీమ్స్ చేస్తూ మీమర్స్ నానా హంగామా చేస్తున్నారు. మరి మైత్రి మూవీస్ వాళ్ళు ఏదో హడావిడిగా దివాళీ కి అప్ డేట్ ఇచ్చే కంగారులో ఇలా చేసి ఉంటారు.

Trolls on Shruti Haasan Pic :

NBK 107: Shruti Haasan welcomed on board