బిగ్ బాస్ హౌస్ లోకి డీప్ ఫ్రెండ్స్ గా అడుగుపెట్టి.. కలిసి ఆడుతూ.. చాలామందిని ఎలిమినేట్ అయ్యేలా చేసిన సిరి - షణ్ముఖ్ లు బిగ్ బాస్ కి వెళ్ళకముందు వెబ్ సీరీస్ లతో అదరగొట్టేసాడు. సిరి - షణ్ముఖ్ లు వెబ్ సీరీస్ లతో బాగా పాపులర్ అయ్యారు. వీరిద్దరూ బిగ్ బాస్ లోకి వచ్చాక సిరి ఓవేరేక్షన్ తోనూ, షణ్ముఖ్ యాటిట్యూడ్ తో చిరాకు తెప్పించారు. కలిసి ఆడనట్టుగానే కనిపిస్తారు.. కానీ ఒకే చోట ఉంటారు. తింటారు.. ఒకే బెడ్ పై పడుకుంటారు. మొదట్లో జెస్సి తో ఫ్రెండ్ షిప్ చేసిన వీరు ఇప్పుడు జెస్సి ని దూరం పెట్టారు. అంత మంచి ఫ్రెండ్ షిప్ మెయింటింగ్ చేసే సిరి షణ్ముఖ్ లు గత రాత్రి టాస్క్ లో తెగ తిట్టేసుకున్నారు. కెప్టెన్సీ టాస్క్ లో వీరిద్దరికి గొడవైంది.
సూపర్ హీరోస్ - విలన్స్ లో సిరి విలన్ గా అందరి బట్టలు బయట వెయ్యగా చాలామంది ఇన్నర్స్ కూడా బయటికి కనిపించేలా పడేసావ్ నువ్ ముందు వాటిని తియ్ అంటూ షన్ను సిరిని తిట్టాడు. సిరి కోపం గా నా వేళ్ళు పని చెయ్యడం లేదు తరవాత తీస్తా అనగానే.. షణ్ముఖ్ - సిరి బాగా తిట్టుకున్నారు. నాకు దెబ్బలకన్నా నీ మాటలే బాధపెడుతున్నాయి అని సిరి అనడమే కాదు.. నీ ఫ్రెండ్ షిప్ ఫేక్, నువ్వు ఫేక్, నీ ఆట ఫేక్ అంటూ షణ్ముఖ్ ని ఎడా పెడా తిట్టేసింది. మరో పక్క షణ్ముఖ్ కూడా సిరిని ఇదే నీ అసలు కారెక్టర్ అంటూ దారుణంగా అవమానించాడు. రెండు రోజులుగా సిరి - షన్ను మధ్యన డిష్యుమ్ డిష్యుమ్ నడుస్తుంది.