టాలీవుడ్ టాప్ ఫ్యామిలీ అయిన మెగా ఫ్యామిలీలో అపోలో సంస్థల అధిపతికి మనవరాలు ఉపాసన.. చరణ్ కి భార్య గా చిరు ఇంటి కోడలిగా వెళ్ళింది. మెగా ఫ్యామిలీతో ఉపాసన కలిసిపోయింది. ఆ ఫ్యామిలిలో ఏ ఈవెంట్ ప్లాన్ చెయ్యాలన్నా ఉపాసనే. తాజాగా మెగా ఫ్యామిలీ దివాళి సెలెబ్రేషన్స్ ఓ రేంజ్ లో జరిగాయి. దానికి ఉపాసన - రామ్ చరణ్ లే హోస్ట్ లు. అయితే టాలీవుడ్ మరో టాప్ ఫ్యామిలీలో కోడలిగా అడుగుపెట్టిన సమంత నాలుగేళ్లకే ఆ ముచ్చటని ముగించేసి ఒంటరిదైంది. నాగ చైతన్య తో విడిపోయాక.. సమంత ఒంటరిగా ఉంటుంది.
సమంతకి టాలీవుడ్ లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. చరణ్, మహేష్, ఎన్టీఆర్ ఇలా అందరూ ఫామిలీస్ తో సమంత క్లోజ్ గా ఉంటుంది. అయితే చైతూ తో విడిపోయాక సమంత వెకేషన్స్, ఆధ్యాత్మిక యాత్రలు పూర్తి చేసుకుని.. మళ్ళీ మాములు స్థితిలోకి వచ్చింది. ఇక ఉపాసన, శిల్పా రెడ్డి ఇలా ఫ్రెండ్స్ తో ఎక్కువగా సద్గురు ప్రవచనాలు వినే సమంత.. తాజాగా రామ్ చరణ్ - ఉపాసనల దివాళి పార్టీలో మెరిసింది. రామ్ చరణ్ - ఉపాసన, ఉపాసన అత్తమ్మ సురేఖ, తల్లి తో ఉన్న పిక్స్, ఉపాసన చెల్లితో ఉన్న పిక్ తో పాటుగా శిల్ప రెడ్డి - ఉపాసన - సమంత ల సెల్ఫీ పిక్స్ ని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానితో మెగా ఫ్యామిలీ దివాళీలో సమంత కూడా పాల్గొంది అనే విషయం తెలిసిపోయింది.