రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి దర్శకంత్వంలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రమోషన్స్ ని రాజమౌళి పక్కా ప్రణాళికతో మొదలు పెట్టేసారు. నవంబర్ 1న ఆర్.ఆర్.ఆర్ గ్లిమ్ప్స్ అంటూ డైలాగ్స్ లేకుండానే మెస్మరైజ్ చేసారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ ఎన్టీఆర్ లతో కలిసి ఓ సాంగ్ ని వదలబోతున్నారు. నవంబర్ 10 న రామ్ చరణ్ - ఎన్టీఆర్ కలిసి డాన్స్ చేస్తున్న సాంగ్ వదలబోతున్నట్టుగా మెగా అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ - అల్లూరి గా రామ్ చరణ్ స్టెప్స్ వేస్తున్న పిక్ ని వదులుతూ అప్ డేట్ ఇచ్చేసారు. ఆ పిక్ చూసిన ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫాన్స్ కి పండగ చేసుకుంటున్నారు.
ఇప్పటివరకు రామ్ చరణ్ కి ఎక్కువ, ఎన్టీఆర్ కి తక్కువ, ఎన్టీఆర్ కి ఎక్కువ చరణ్ కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుందో అని ఫాన్స్ అందరూ మదనపడుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో చరణ్ - ఎన్టీఆర్ పాత్రలపై తూకాలు వేస్తున్నారు. అలాంటి సమయంలో రామ్ చరణ్ - ఎన్టీఆర్ ల స్టెప్స్ వేసే పోస్టర్ కి ఫాన్స్ మైమరిచిపోతున్నారు. రాజమౌళి సర్ ఇది కదా మాకు కావల్సింది అంటూ ఫాన్స్ అందరూ రాజమౌళి ని ఆకాశానికెత్తేస్తున్నారు. నిజంగా ఫాన్స్ అభిప్రాయమే కాదు.. రామ్ చరణ్ ని ఎన్టీఆర్ ని అలా చూస్తుంటే నిజంగా అద్భుతమే అన్నట్టుగా ఉంది.. ఆ పోస్టర్.