Advertisementt

నాని శ్యామ్ సింగ రాయ్ ఫస్ట్ సింగిల్

Sat 06th Nov 2021 03:37 PM
nani,sai pallavi,krithi shetty,madonna sebastian,rahul ravindran,murali sharma,abhinav gomatam,telugu,tamil,kannada and malayalam languages,shyam singha roy,shyam singha roy song  నాని శ్యామ్ సింగ రాయ్ ఫస్ట్ సింగిల్
First Lyrical Of Nani Shyam Singha Roy, Is Out నాని శ్యామ్ సింగ రాయ్ ఫస్ట్ సింగిల్
Advertisement
Ads by CJ

నేచుర‌ల్ స్టార్‌ నాని నటిస్తోన్న శ్యామ్ సింగ రాయ్ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. శనివారం మొదటి పాటను సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయ‌న్స‌ర్స్ స‌మ‌క్షంలో  విడుద‌ల చేసి అంచనాలను పెంచేశారు. మిక్కీ జే మేయర్ అందించిన ఈ పాటను తెలుగు, తమిళ,కన్నడ, మళయాల భాషల్లో విడుదల చేశారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌లో డైరెక్టర్ రాహుల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

తాను నమ్మిన జనాల కోసం నిలబడే శ్యామ్‌‌లోని తత్త్వాన్ని, కోపాన్ని ప్రతిబింబించేలా ఈ పాట సాగింది. క్రిష్ణకాంత్ రాసిన ఈ పాట ఎంతో స్పూర్తినిచ్చేలా ఉంది. మిక్కీ జే మేయర్ మంచి ట్యూన్‌ను ఇచ్చారు. విశాల్ దద్లానీ, అనురాగ్ కులకర్ణి కలిసి సంయుక్తంగా ఈ పాటను అద్భుతంగా పాడేశారు. లిరికల్ వీడియోలో నాని బెంగాలీ యువకుడిలా అద్భుతమైన పాత్రలో కనిపిస్తున్నారు. సాయి పల్లవి ఆయన భార్యగా కనిపిస్తున్నారు. కోల్‌కతా నేపథ్యంలో సినిమాను తెరకెక్కించడంతో కొన్ని బెంగాలీ పదాలు కూడా వాడారు. ఈ పాట ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసేలా ఉంది.

కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా.. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్, ప్రతిభా వంతుడైన యశ్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫర్లుగా పని చేస్తున్నారు.

భారీ వీఎఫ్ఎక్స్‌తో రాబోతోన్న ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.

First Lyrical Of Nani Shyam Singha Roy, Is Out:

Rise Of Shyam, First Lyrical Of Nani Shyam Singha Roy, Is Out