మెగాస్టార్ చిరు ప్రస్తుతం గాడ్ ఫాదర్ షూటింగ్ లో బిజీగా ఉండడమే కాదు.. మధ్య మధ్యలో ఆయన తన కొత్త సినిమాల పూజా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తాజాగా Mega154 ని బాబీ దర్శకత్వంలో పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టిన చిరు రేవు 11 న మెహెర్ రమేష్ తో భోళా శంకర్ మొదలు పెట్టబోతున్నారు. భోళా శంకర్ 11న మొదలై 15 నుండి రెగ్యులర్ షూట్ కి వెళ్ళిపోతుంది. అయితే చిరంజీవి ఇప్పుడు భోళాశంకర్ విషయంలో కంగారు పడుతున్నట్లుగా ఫిలిం నగర్ టాక్. ఎందుకంటే రజినీకాంత్ పెద్దన్న మూవీ చూసిన చిరు ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో వస్తున్న భోళా శంకర్ కథ విషయంలో ఆలోచనలో ఉన్నారట.
రజినీకాంత్ - కీర్తి సురేష్ అన్నా చెల్లెళ్లుగా నటించిన పెద్దన్న ఘోరంగా ప్లాప్ అవడం, ఇప్పుడు ఆ ఎఫెక్ట్ భోళా శంకర్ పై పడుతుందేమో అని ఫీలవుతున్నారట. ఆల్రెడీ అజిత్, లక్ష్మి మీనన్ అన్నా చెల్లెలుగా వేదాళం సూపర్ హిట్.. ఇప్పుడు మళ్ళి అదే కథని ఆదరిస్తారా.. లేదా.. అనేది ఇప్పుడు ఆయన ఆలోచనట. మరి చిరు - కీర్తి సురేష్ అన్నా చెల్లెలుగా మొదలు కాబోతున్న భోళా శంకర్ ఫైనల్ రిజల్ట్ ఏమిటనేది ప్రేక్షకులే నిర్ణయించాలి.