Advertisementt

అల్లు అర్జున్ కొడుకు అనిపించాడుగా

Mon 08th Nov 2021 12:30 PM
allu ayaan,allu arjun,varun tej,ghani movie,allu ayaan workouts,allu bobby,varun tej ghani,allu ayaan gym video  అల్లు అర్జున్ కొడుకు అనిపించాడుగా
Allu Ayaan For Ghani అల్లు అర్జున్ కొడుకు అనిపించాడుగా
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడమే కాదు.. ఈ దివాళి రోజున మెగా ఫ్యామిలీ సెలెబ్రేషన్స్ లో పాల్గొని.. ఆ పార్టీ లో సందడి చేసాడు. భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హ లతో కలిసి స్పెషల్ ఫోటో షూట్ చేయించుకుని వాటిని సోషల్ మీడియాలో వదిలాడు. అల్లు అర్జున్ కొడుకు అయాన్, అలకి స్టార్ కిడ్స్ గా సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉంది. అయితే తాజాగా అల్లు అయాన్ వరుణ్ తేజ్ ని యాజిటీజ్ గా దించేసాడు. ఏ విషయంలో అంటే.. వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని అనే బాక్సింగ్ నేపథ్యంతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. 

ఎక్కువ శాతం జిమ్ లోనే గడిపిన వరుణ్ తేజ్ తన వర్కౌట్ వీడియోస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇప్పుడు అచ్చం వరుణ్ తేజ్ మాదిరిగానే అల్లు అర్జున్ కొడుకు అయాన్ జిమ్ లో కుస్తీలు పడ్డాడు. వరుణ్ తేజ్ లాగే జిమ్ చెయ్యడం.. బాక్సింగ్ చెయ్యడం, రన్నింగ్ చెయ్యడం అబ్బో అచ్చం వరుణ్ మాదిరిగానే అల్లు అయాన్ తన యాక్టింగ్ ని చూపించాడు. అల్లు అర్జున్ ఫిట్ నెస్ లో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో.. ఇప్పడు అయాన్ ని చూస్తే నిజంగా అల్లు అర్జున్ కొడుకు అనిపించాడుగా అంటారు. వరుణ్ తేజ్ గని మూవీని అల్లు బాబీ నిర్మిస్తున్నాడు. అప్పుడప్పుడు అల్లు బ్యాచ్ గని సెట్స్ లో సందడి చేసే ఫోటొస్ సోషల్ మీడియా లో చూస్తూనే ఉన్నాము. 

Allu Ayaan For Ghani:

Allu Ayaan Gym Video Viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ