Advertisementt

రోజా ప్లేస్ కొట్టేసినట్లేనా

Mon 08th Nov 2021 09:51 PM
indraja,s roja,jabardasth,jabardasth judge,mano,indraja vs roja  రోజా ప్లేస్ కొట్టేసినట్లేనా
Indraja Replaces Roja రోజా ప్లేస్ కొట్టేసినట్లేనా
Advertisement
Ads by CJ

జబర్దస్త్ లో రోజా గత కొన్నేళ్లుగా జేడ్జ్ ప్లేస్ లో అలరిస్తుంది. మధ్య మధ్యలో ఏదైనా ట్రిప్స్ వేసినా.. పాలిటిక్స్ లో బిజీగా వున్నా రోజా చిన్నపాటి బ్రేక్ తో మళ్ళీ జబర్దస్త్ కి వచ్చేస్తుంది. నాగబాబు లాంటి వాళ్ళు జబర్దస్ ని వదిలేసినా.. రోజా మాత్రం ఆ జేడ్జ్ సీట్ ని వదలడం లేదు. అయితే ఆ మధ్యన నటి ఇంద్రజ కొన్నాళ్ళు రోజా ప్లేస్ లో జబర్దస్త్ కి జేడ్జ్ గా వచ్చింది. రోజా ఏదో ఆపరేషన్ చేయించుకుని కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇంద్రజ బుల్లితెర కి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇంద్రజ ఆనందం ఎంతో సేపు నిలబడనివ్వకుండానే రోజా మళ్ళీ జబర్దస్త్ జేడ్జ్ ప్లేస్ కి రీ ఎంట్రీ ఇచ్చేసింది. పాపం ఇంద్రజ అనుకుంటే.. ఈటీవిలోనే శ్రీదే సోడా కంపెనీ ప్రోగ్రాంలో ఇంద్రజ ఆదివారం, ఆదివారం గెస్ట్ గాను, జేడ్జ్ గాను, ఇంకా సింగర్ గా, డాన్సర్ గాను అదరగొట్టేస్తుంది.

అయితే తాజాగా జబర్దస్త్ లో మరోసారి రోజా మిస్ అయ్యింది. ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియదు కానీ.. రోజా జేడ్జ్ ప్లేస్ కి ఇంద్రజ మళ్ళీ వచ్చింది. రోజా కూడా ఎలాంటి వెకేషన్ కి వెళ్ళలేదు. ఎందుకంటే నగరి ఎమ్యెల్యేగా రోజా ప్రతి రోజు సోషల్ మీడియాలో నగరి అభివృద్ధి కార్యక్రమాలతో  ప్రజల వద్దే ఉంటుంది. ఇలాంటి టైం లో రోజా జబర్దస్త్ కి రాకపోవడం చూస్తే.. ప్రస్తుతం రోజా జబర్దస్త్ కి భారీ బ్రేక్ ఇవ్వడం వలనే ఇంద్రజ జబర్దస్త్ స్టేజ్ పైకి వచ్చింది అని అంటున్నారు.. మరోపక్క రోజా ప్లేస్ కొట్టేసిన ఇంద్రజ అంటుంటే.. రోజా ని చూసి బోర్ కొట్టింది.. కొన్నాళ్ళు ఇంద్రజ నే ఉంచండి అంటూ మల్లెమాలకి రిక్వెస్ట్ లు పెడుతున్నారు మరికొందరు. 

Indraja Replaces Roja:

Indraja Replaces Roja in Jabardasth 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ