నిన్న సోమవారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియని ని బిగ్ బాస్ కొత్తగా కాదు సరికొత్తగా. ఇంట్రెస్టింగ్ గా నిర్వహించారు. జైలు కి వెళ్లడం, బయటికి రావడం చివరికి షణ్ముఖ్, మానస్, సన్నీ, సిరి, రవి లు నామినేషన్స్ లోకి వెళ్లగా.. కెప్టెన్ అని స్పెషల్ పవర్ తో కాజల్ ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చింది. ఇక ఈ వారం నామినేషన్స్ పర్వం ముగిసిన తర్వాత హౌస్ మేట్స్ మూడ్స్ అన్ని మారిపోయాయి. అందులో మరీ ముఖ్యంగా సన్నీని జైల్లో ఎవరు సేవ్ చెయ్యలేదు.. దానితో మానస్ తో ఎవ్వరితో అవసరం లే.. ఉంటే కలిసి ఉందాం.. లేదంటే కలిసి పీకుదాం.. అన్నాడు . ఇక షణ్ముఖ్ జెస్సి తో మనిద్దరం మాట్లాడుకోవడం లేదురా.. ముందులాగా అదేరా నువ్వు చేస్తుంది.. అనగానే జెస్సి ఫీలయ్యాడు.
ఇక రవి - కాజల్ మధ్యలో కూడా డిస్కర్షన్ జరిగింది. మోర్ దెన్ ఈజ్ శ్రీరామ్ ఇంపార్టెంట్.. అని కాజల్ ని అడిగాడు రవి.. నేను నా గేమ్ ఆడొద్దా అని కాజల్ అంది.. దానితో రవి షాక్. ఇక శ్రీరామ్ - అని మధ్యన డిస్కర్షన్.. తర్వాత ప్రియాంక మానస్ దగ్గరికి వచ్చి మానస్ ఏమైనా తీసుకురానా అని అడిగింది.. దానికి మానస్ కావాలంటే నేను పెట్టుకుంటాను అనగానే ప్రియాంక హార్ట్., ఇక రవి, అని, శ్రీరామ్ బయట వాక్ చేస్తూ.. మానస్ కి ధైర్యం లేదు.. అన్నాడు రవి. ఇక సన్నీ, మానస్, కాజల్, ప్రియాంక కూర్చుని ఉండగా.. సన్నీ మాట్లాడుతూ నువ్వు కాపాడుకునే శక్తి ఉన్నప్పుడు అప్పుడు కాపాడకుండా నేను పూజలు చేస్తాను.. అంటే అంటూ కాజల్, ప్రియాంకలను ఉద్దేశించి అనగా... కాజల్ సారి చెప్పింది. దానికి సన్నీ చేతులు కాలాక ఆకులూ పట్టుకోవడం వెస్ట్ అన్నాడు... మరి ఈవారం నామినేషన్స్ హౌస్ మేట్స్ మధ్యన, ఫ్రెండ్స్ మధ్యన అగ్గి రాజేసింది.