చిరంజీవి - మెహెర్ రమేష్ కాంబోలో మొదలు కాబోతున్న భోళా శంకర్ టెస్ట్ ఫోటో షూట్ నిన్ననే మొదలు పెట్టినట్లుగా మెహెర్ రమేష్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ప్రస్తుతం భోళా శంకర్ మూవీ ఓపెనింగ్ పూజ కార్యక్రమాల్లో బిజీగా వుంది టీం. నవంబర్ 11 ఉదయం 7.45 నిమిషాలకు అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో మొదలయ్యే భోళా శంకర్ ఈ నెల 15 నుండి రెగ్యులర్ షూట్ కూడా మొదలు పెట్టుకోబోతుంది. ఈ సినిమాలో మెగాస్టార్ కి చెల్లి కేరెక్టర్ లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్నట్టుగా రక్షా బంధన్ స్పెషల్ గా రివీల్ చేసారు మేకర్స్. ఇక ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా తమన్నా నటిస్తుంది అనే ప్రచారం జరిగింది.
తాజాగా భోళా శంకర్ నుండి అఫీషియల్ ప్రకటన వచ్చింది. భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ కి జోడిగా ఈ సినిమాకి హీరోయిన్ గా తమన్నా నటించబోతున్నట్టుగా ప్రకటించారు. కీర్తి సురేష్ ని లవ్ చేసి పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి అక్క పాత్రలో తమన్నా గ్లామర్ గా కనిపించనుంది. తమిళం వేదాళం లో అజిత్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటించగా.. ఇప్పుడు ఈ భోళా శంకర్ లో చిరుకి జోడిగా తమన్నా నటించబోతుంది. ఇంకా సినిమా కి మహతి స్వర సాగర్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా.. సినిమాకి సంబంధించి మిగతా వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.