రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ పై అంతకంతకు అంచనాలు పెంచేస్తున్నారు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ నుండి నాటు నాటు సాంగ్ కోసం అందరిని వెయిట్ చేసేలా చేస్తున్నారు. కొమరమ భీం ఎన్టీఆర్, అల్లూరి రామ్ చరణ్ ల నాటు డాన్స్ కోసం అందరూ వైటింగ్ . అయితే రీసెంట్ గా రాజమౌళి ఓ ప్రవేట్ కార్యక్రమంలో ఉన్నట్టుండి ఆర్.ఆర్.ఆర్ డైలాగ్ ని ఒకటి లీక్ చేసారు. అయితే ఆ డైలాగ్ ని రాజమౌళి కావాలనే లీక్ చేసారా.. అనే అనుమానాలు నెటిజెన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ రాజమౌళి లీక్ చేసిన ఆర్. ఆర్. ఆర్ డైలాగ్ ఏమిటి అంటే..
యుద్దాలు వెతుక్కుంటూ.. ఆయుధాలు వాటంతట అవే వస్తాయి.. అదే ధర్మ యుద్ధం అయితే.. విజయాలు తథ్యం.. అనే డైలాగ్ అన్నమాట. అంటే హీరోలు ధర్మయుద్ధం చేసి సక్సెస్ పొందుతారని ఆ డైలాగ్ సారాంశం అంటుంటే.. డైలాగ్ అదిరింది. కానీ ఎప్పుడూ అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్ గా ఉండే రాజమౌళిగారు ఈ డైలాగ్ ఇలా లీక్ చేయడం వెనుక.. ఆర్.ఆర్.ఆర్ మూవీకి క్రేజ్ ప్రజెంట్ ట్రెండ్ లో ఉండటానికే అని.. సో దాన్ని లేపడానికే ఇలా అని అంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యన ఆర్.ఆర్.ఆర్ గ్లిమ్ప్స్ రిలీజ్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో పవన్ భీమ్లా నాయక్ రేంజ్ అందుకోలేకపోయింది ఆర్.ఆర్.ఆర్ గ్లిమ్ప్స్ అంటూ పవన్ ఫాన్స్ కాస్త హడావిడి చేయడం చూసిన రాజమౌళి సినిమాలో కీలకమైన డైలాగ్ లీక్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేసారు అంటున్నారు నెటిజెన్స్.