Advertisementt

పవన్‌కు సిగ్గులేదా..

Tue 09th Nov 2021 06:43 PM
minister kodali nani,kodali nani,fires,pawan kalyan,bjp  పవన్‌కు సిగ్గులేదా..
Kodali Nani fires on Pawan Kalyan and BJP పవన్‌కు సిగ్గులేదా..
Advertisement
Ads by CJ

ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ని ఏపీ మంత్రులు నోటికి వచ్చినట్లుగా మట్లాడుతూ రెచ్చగొడుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ - బీజేపీ పొత్తుపై ఏపీ మినిస్టర్ కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేసారు. బద్వేలు ఉప ఎన్నికలో వైసిపికి ఎనలేని మెజారిటీ వచ్చింది అని, అక్కడ పోటీ చేసిన బీజేపీకి ప్రజలు గడ్డి పెట్టారని  కొడాలి నాని అనడమే కాదు బీజేపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వ్యాఖ్యానించారు. 

ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. బిజెపిపై పెట్రోల్‌.. టిడిపిపై డీజిల్‌ పోసి జనం తగులబెట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పలికిమాలిన పార్టీ. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తున్న బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు పవన్‌ కల్యాణ్‌కు సిగ్గు లేదా.. అంటూ కొడాలి నాని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్‌ మేక, నక్క కాదు.. పులివెందుల పులి. గల్లీలో ఉన్న సిల్లీ బిజెపి నాయకులు ఆయన్ను ఏమీ చేయలేరు... అంటూ పవన్ కళ్యాణ్ ని, బీజేపీకి నేతలని కొడాలి నాని ఏకిపారేశారు. 

Kodali Nani fires on Pawan Kalyan and BJP:

Minister Kodali Nani fires on Pawan Kalyan and BJP

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ