రష్మిక మందన్న ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో మార్మోగుతున్న పేరు. కన్నడ బ్యూటీ రష్మిక ఇప్పుడు, తెలుగు, హిందీ సినిమాలతో ఫుల్ బిజీ. చక్కటి వ్యాయామాలతో ఫిట్ గా గ్లామర్ గా కనిపిస్తున్న రష్మిక.. శ్రీ వల్లి గా పుష్ప పాన్ ఇండియా మూవీలో అల్లు అర్జున్ సరసన డీ గ్లామర్ లుక్ లో అదరగొట్టేస్తుంది. అల్లు అర్జున్ తో పోటీగా డాన్స్ చేస్తూ.. డీ గ్లామర్ లుక్ లోనే అందాలను ఆరబోసిన రష్మిక.. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులో చక్కగా సారీ తో ట్రెడిషనల్ గా కనిపిస్తుంది. ఇక బాలీవుడ్ లో బిగ్ ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉంది.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే రష్మిక మందన్న తరచూ తన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యూత్ కి నిద్ర లేకుండా చేస్తుంది. గ్లామర్ గానూ.. చక్కటి ట్రెడిషనల్ డ్రెస్సులతో మత్తెక్కించే రష్మిక తాజగా బ్లాక్ జాకెట్ తో మత్తెక్కించింది. బ్లాక్ జాకెట్ వేసుకుని తమకంగా కళ్ళు మూసుకున్న రష్మిక లేటెస్ట్ పిక్ సామజిక మద్యమాల్లో వైరల్ అయ్యింది.