పుష్ప సినిమా సెట్స్ నుండి తరచూ ఏదో ఒక లీక్ పుష్ప టీం ని ఇబ్బంది పెడుతుంది. పుష్ప పాన్ ఇండియా ఫిలిం.. సెట్స్ మీదకెళ్ళినప్పటి నుండి..ఇదే వరుస. అల్లు అర్జున్ పుష్ప రాజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయకముందే పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ లుక్ లీకైపోయింది. ఆ తర్వాత సెట్స్ నుండి యాక్షన్ సీన్స్ అని, సాంగ్ మేకింగ్స్ వీడియోస్ అంటూ చాలా లీక్స్ బయటికి వచ్చాయి. అయితే తాజాగా పుష్ప సెట్స్ నుండి మరో లీక్ ఇప్పుడు టీం ని ఇబ్బంది పెడుతుంది. పుష్ప షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉంది. ప్రస్తుతం పుష్ప లో ఓ మాస్ నెంబర్ ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.
పుష్ప సినిమా మాస్ సాంగ్ చిత్రీకరణలో 1000 మంది డాన్సర్స్ పాల్గొంటున్నట్లు ఈ మధ్యనే మేకర్స్ అఫీషియల్ అప్ డేట్ కూడా ఇచ్చారు. 1000 మంది డాన్స్ తో అల్లు అర్జున్ డాన్స్ నటనే ఫాన్స్ ఊగిపోయారు. కానీ ఇప్పుడు అదే సాంగ్ నుండి కొన్ని విజువల్స్ లీకైనట్లుగా తెలుస్తుంది. షూటింగ్ స్పాట్ నుండి అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తున్న కొన్ని వీడియోలు ఆన్ లైన్ లో లీక్ చేశారు. ఆ వీడియో ని షేర్ చేసిన ఓ నెటిజెన్ ఏకంగా వెయిటింగ్ పుష్ప మావా.. హే బిడ్డా ఇది నా అడ్డా అంటూ కామెంట్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. దానితో ఇప్పుడు పుష్ప మాస్ సాంగ్ అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. కాకపోతే పుష్ప లీక్స్ పుష్ప టీం ని టెంక్షన్ పెడుతున్నాయి. సుకుమార్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ లీకులని ఆపలేకపోతున్నారు.