బిగ్ బాస్ సీజన్ 5 లో ఈ వారం రవి, మానస్, సన్నీ, కాజల్, సిరి లు నామినేషన్స్ లో ఉన్నారు. టాప్ 5 లో ఉండాల్సిన వారు ఇప్పుడు నామినేషన్స్ లో ఉండడంతో ఈ వారం ఎలిమినేషన్స్ ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో BB హోటల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఎవరికి వారే వీర పెరఫార్మెన్స్ ఇస్తున్నారు. జెస్సి అనారోగ్యంతో బయటకి వెళ్లి టెస్ట్ చేయించుకొని ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాడు. ఈ వారం ఇమ్యూనిటీ కోసం ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఆటలో క్రేజ్ చూపిస్తున్నారు. అయితే ఈ వారం ఓ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో విజె సన్నీ ఓటింగ్ పరంగా నెంబర్ వన్ ప్లేస్ లో ఉండగా.. తర్వాత ఓటింగ్ పరంగా రవి, సిరి లు ఉన్నారని తెలుస్తుంది. సిరి కి 25 శాతానికి పైగా ఓట్లు వచ్చాయని, అలాగే యాంకర్ రవి సుమారు 20 శాతం ఓట్లు కొల్లగొట్టాడని.. ఆ తరవాత స్థానంలో కాజల్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత మానస్ లీస్ట్ ఓటింగ్స్ తో వెనకబడి ఉన్నాడని.. ఈ వారం కాజల్ - మానస్ లే డేంజర్ జోన్ లో ఉన్నారని ఓటింగ్స్ చెబుతున్నాయి. ఈ వారం ఎవరు వెళ్ళిపోయినా.. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వెళిపోయినట్లే.