జనవరి 7న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాజమౌళి - ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో మొదలైపోయాయి. ప్రేక్షకులు అందులోనూ పాన్ ఇండియా ఆడియన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఆగష్టు లో దోస్తీ సాంగ్ తో రచ్చ స్టార్ట్ చేసిన రాజమౌళి.. నవంబర్ 1 న ఆర్.ఆర్.ఆర్ గ్లిమ్ప్స్ తోనూ, నవంబర్ 10 న టాప్ లెగిసిపోయే.. నాటు కొట్టుడు సాంగ్ తోనూ సినిమాపై మరిన్ని అంచనాలు లేపారు. రీసెంట్ గా రిలీజ్ అయిన చరణ్ - ఎన్టీఆర్ ల నాటు నాటు సాంగ్ యూత్ ని ఫాన్స్ ని ఉర్రుతలూగిస్తుంది.
ఇక మీదట ఆర్.ఆర్.ఆర్ నుండి అదిరిపోయేలా మూడో సాంగ్ రిలీజ్ కి సిద్దమవుతుంది అని.. ఈ నెల 18 న ఆర్.ఆర్.ఆర్ నుండి మూడో సాంగ్ జాతర కూడా మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి మూడో సాంగ్ తో రాజమౌళి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో కానీ.. ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని దుబాయ్ లోనూ, అలాగే మూడు నాలుగు ప్రెస్ మీట్స్ ని ముంబై, చెన్నై, హైదరాబాద్ లలో రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని.. ఆ ఈవెంట్స్ లోనే ట్రైలర్ లాంచ్ ప్రోగ్రాం ని భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది.