బిగ్ బాస్ సీజన్ 5 లో ఈ వారం ఎలిమినేషన్స్ ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే నామినేషన్స్ లో ఉన్న వారంతా పేరున్న, క్రేజీ కంటెస్టెంట్స్. టాప్ 5లోకి వెళ్లాల్సిన వారిలో ఎవరో ఒకరు ఆదివారం ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. సన్నీ,. సిరి, రవి, మానస్, కాజల్ లు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. ఇక సన్నీ ఓటింగ్ పరంగా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. ఆ తర్వాత సిరి సెకండ్ ప్లేస్ లోను రవి థర్డ్ ప్లేస్ లోను కొనసాగుతున్నారు. అయితే ఈ వారం కాజల్ కానీ మానస్ కానీ ఎలియేమినేట్ అయ్యే ప్రమాదంలో పడ్డారు. వీరిద్దరే డేంజర్ జోన్ లో ఉన్నారు. ఖచ్చితంగా మానస్ అండ్ కాజల్ లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవడం పక్కా అని.. ఫైనల్ గా నాగిని కాజల్ ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు.
కానీ అనూహ్యంగా నామినేషన్స్ లో లేని వ్యక్తి ఈ వారం బిగ్ బాస్ హౌస్ ని వీడబోతున్నారు. అతనే జెస్సి.. జెస్సి వట్టిగో సమస్యతో బాధపడడంతో .. బయటికి తీసుకొచ్చి డాక్టర్స్ తో టెస్ట్ లు వి చేయించి బిగ్ బాస్ మళ్ళీ హౌస్ లోకి పంపేందుకు సీక్రెట్ రూమ్ లో క్వారంటైన్ లో పెట్టారు. అక్కడినుండి జెస్సి హౌస్ మేట్స్ స్ట్రాటజిలానీ అంచనా వేస్తున్నాడు. అయితే జెస్సి కి ఆరోగ్యం మెరుగుపడలేదు సరికదా.. అతను వాడే మెడిసిన్ వలన జెస్సి కాస్త ఇబ్బంది పడుతున్నాడు. సో అతన్ని అలా వెంటనే బయటికి పంపకుండా.. నాగార్జున వచ్చే వరకు అంటే ఈ రోజో.. రేపో.. సగౌరవంగా హౌస్ నుండి బయటికి పంపే ఏర్పట్లని బిగ్ బాస్ యాజమాన్యం చేస్తుందట. సో ఈ వారం నామినేషన్స్ లో లేకుండానే ఎలిమినేట్ అవుతున్నాడు జెస్సి.