తొమ్మిదేళ్ల క్రితం ఈటీవీలో మల్లెమాల యాజమాన్యం జబర్దస్త్ కామెడీ షో మొదలు పెట్టడం.. అది సూపర్ డూపర్ సక్సెస్ అవడంతో.. ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ మరో షోని మొదలు పెట్టి హిట్ కొట్టింది. తొమ్మిదేళ్లుగా జబర్దస్త్ షో కి రోజా జేడ్జ్ గా పాతుకుపోగా.. మధ్యలో నాగబాబు వెళ్లిపోయారు. చమ్మక్ చంద్ర లాంటి వాళ్లకు వెళ్ళిపోయినా.. జబర్దస్త్ కి సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్, ఆది లాంటి వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. కామెడీ పంచ్ లతో, సుధీర్ అయితే రష్మీ రొమాంటిక్ ట్రాక్ తో జబర్దస్త్ ని ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ గానే నడిపించారు. గత రెండేళ్లుగా అంటే నాగబాబు, చమ్మక్ చంద్ర లాంటి వాళ్ళు జబర్దస్ షో నుండి అర్ధాంతరంగా తప్పుకోవడంతో షో రేటింగ్ పడిపోతుంది అనుకుంటే.. సుధీర్, ఆది లాంటి వాళ్ళు తమ స్కిట్స్ తో షో ని నిలబెట్టారు.
అప్పటినుండి మల్లెమాల టివి ప్రతి ఏడాది కమెడియన్స్ నుండి అగ్రిమెంట్ చేయించుకుంటుంది. జబర్దస్త్ కమెడియన్స్ తోనే ఈటివి స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తూ హడావిడి కూడా చేస్తుంటారు. అయితే తాజాగా సుధీర్ జబర్దస్త్ కి జబర్దస్త్ షాక్ ఇచ్చాడనే న్యూస్ మొదలైంది. అంటే హీరోగా ట్రై చేస్తున్న సుధీర్.. జబర్దస్త్ కి టైం కేటాయించలేకపోవడంతో.. ఈ ఏడాది మల్లెమాల యాజమాన్యానికి సుధీర్ అగ్రిమెంట్ కూడా చేయలేదట. యెప్పటికే హీరోగా ఓ సినిమా సెట్స్ మీదుండగా.. మరో సినిమా మొదలు కాబోతుంది. అందుకే సుధీర్ జబర్దస్త్ ని వీడబోతున్నాడని అంటున్నారు. మరి సుడిగాలి సుధీర్ తో పాటే శ్రీను, రామ్ ప్రసాద్ లు కూడా జబర్దస్త్ ని వదిలెయ్యబోతున్నారనే న్యూస్ నడుస్తుంది.