Advertisementt

బాలయ్య అన్ స్టాపబుల్ నెక్స్ట్ గెస్ట్

Sat 13th Nov 2021 10:22 PM
unstoppable,aha talk show,aha ott,nbk next episode guest,balakrishna,vijay deverakonda,nani,mohan babu  బాలయ్య అన్ స్టాపబుల్ నెక్స్ట్ గెస్ట్
Balayya Unstoppable Next Guest? బాలయ్య అన్ స్టాపబుల్ నెక్స్ట్ గెస్ట్
Advertisement
Ads by CJ

బాలకృష్ణ అఖండ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది.. మరోపక్క ఆయన నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 కూడా పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టేసారు. మరోపక్క ఆహా ఓటిటి అన్ స్టాపబుల్ టాక్ షో తో రచ్చ రచ్చ చేస్తున్నారు. అన్ స్టాపబుల్ అంటూ యంగ్ హీరోల మాదిరి హుషారుగా డాన్స్ చేస్తూ.. ఎదుటి సెలెబ్రిటీ తో ఆడుకుంటున్న బాలయ్య.. మంచు మోహన్ బాబు తో చేసిన ఎపిసోడ్ వన్ ని అదరగొట్టేసాడు. ఆ హుందాతనం, ఆ ఆహార్యం, ఆ స్టయిల్, చిలిపి అల్లరి, మధ్యలో కామెడీ , కెరీర్ అంటూ బాలయ్య ఆహా స్టేజ్ మీద సందడి సందడి చేస్తున్నారు. ఇక రీసెంట్ గా నాని తో సెకండ్ ఎపిసోడ్ తోనూ అదరగొట్టేసాడు బాలయ్య. నాని తో కలసి చిన్న పిల్లాడిలా తన షో ని తానే ఎంజాయ్ చేసారు.. నాని ఆదిత్య 369 సీక్వెల్ గురించి చెప్పమంటే.. అమ్మో చెప్పను సీక్రెట్ అన్న బాలయ్య తొడకొట్టి డైలాగ్స్ చెప్పడం అందరిని ఆకట్టుకుంది.

రెండు ఎపిసోడ్స్ తోనే షో పై అంచనాలు పెంచేసిన బాలకృష్ణ ఆహా అన్ స్టాపబుల్ థర్డ్ ఎపిసోడ్ కి మరో యంగ్ కాదు పాన్ ఇండియా క్రేజీ స్టార్ హీరో రాబోతున్నాడు. అతనే అతి తక్కువ కాలంలో స్టార్ హీరోగా మారిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. లైగర్ మూవీ తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్న విజయ్ దేవరకుపండ.. రౌడీ హీరోగా ఆహా ఓటిటిలో బాలకృష్ణ తో కలిసి అన్ స్టాపబుల్ టాక్ షోకి వచ్చాడని.. ఇప్పటికే ఈ ఎపిసోడ్ చిత్రీకరణ కూడా పూర్తయినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే లైగర్ లాస్ట్ షెడ్యూల్ కోసం విజయ్ దేవరకొండ పూరి తో కలిసి అమెరికా వేగాస్ కి చెక్కేసాడు. సో.. ఈ ఎపిసోడ్ చిత్రీకరణ ఎప్పుడో పూర్తయినట్లుగా తెలుస్తుంది. 

Balayya Unstoppable Next Guest?:

Unstoppable with NBK Next Episode Guest

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ