Advertisementt

నిఖిల్ 18పేజీస్ రిలీజ్ డేట్ ఫిక్స్

Sun 14th Nov 2021 12:19 PM
nikhil 18 pages,february,nikhil,anupama parameswaran,surya pratap,bunny vaas,sukumar  నిఖిల్ 18పేజీస్ రిలీజ్ డేట్ ఫిక్స్
Nikhil 18 Pages Release Date Fix నిఖిల్ 18పేజీస్ రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, గార్జీయ‌స్ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ రాసిన క‌థ‌తో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌కత్వంలో సిద్ధం అవుతున్న మూవీ 18 పేజీస్. జీఏ2పిక్చ‌ర్స్ -  సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా 18 పేజీస్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ గా అంద‌రి మ‌న్న‌నులు అందుకుంటున్న బ‌న్నీ వాసు ఈ చిత్రానికి నిర్మిత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన 18 పేజీస్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లకు అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుత‌మైన ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ నేప‌థ్యంలో 18 పేజీస్ విడుద‌ల తేదిని నిర్మాత బ‌న్నీ వాసు ప్ర‌క‌టించారు.

 ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ రేంజ్ లో ఫిబ్ర‌వ‌రి 18, 2022న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా బ‌న్నీవాసు తెలిపారు. స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కుమారి 21 ఎఫ్ తో యూత్ ఫుల్ డైరెక్ట‌ర్ గుర్తింపు తెచ్చుకున్న ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ 18 పేజీస్ ని కూడా వినూత్నంగా తెర‌కెక్కిస్తున్నారు.

Nikhil 18 Pages Release Date Fix:

Nikhil 18 Pages  to be released on February 19th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ