Advertisementt

బిగ్ బాస్ 5: సన్నీని బ్యాడ్ గా చూపించేసారు

Sun 14th Nov 2021 12:41 PM
bigg boss 5,bigg boss yesterday episode,vj sunny,siri,shanmukh,highlights  బిగ్ బాస్ 5: సన్నీని బ్యాడ్ గా చూపించేసారు
Bigg Boss 5: VJ Sunny was shown to be too bad బిగ్ బాస్ 5: సన్నీని బ్యాడ్ గా చూపించేసారు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 లో కాస్త హౌస్ లో ఎంటర్టైన్ చేస్తున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అతను సన్నీ నే. విజె సన్నీ టాస్క్ లో అగ్రెస్సివ్ గా ఆడడం, అలాగే మధ్యలో కామెడీ చెయ్యడం చేస్తున్నాడు. అయితే టాస్క్ ల విషయంలో సన్నీ కోపంలో ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్ధం కావడం లేదు. దానితో అతను ఎంతగా ఆడినా.. ఎంతగా పెరఫార్మెన్స్ ఇచ్చినా అదంతా మర్చిపోయి సన్నీ మాట్లాడిన మాటలే హైలెట్ అవుతున్నాయి. బ్యాడ్ వర్డ్స్ అలాగే ఇతర కంటెస్టెంట్స్ తో సన్నీ బీహేవియర్ బావుండలేదు అంటూ గత రాత్రి అంటే నాగార్జున శనివారం ఎపిసోడ్ లో కెప్టెన్ రవి దగ్గర నుండి చాలావరకు సన్నీ ది బ్యాడ్ బిహేవియర్ అంటూ పాయింట్ అవుట్ చేసారు.

ఆఖరికి నాగార్జున కూడా సన్నీనే టార్గెట్ చేసాడు. కాజల్ ఎంతగా డిఫెండ్ చేసినా.. సన్నీ మాత్రం బ్యాడ్ బిహేవియర్ తోనే కష్టాలు కొని తెచ్చుకున్నాడు. సిరిని, షణ్ముఖ్ ని కాస్త తొందరపాటుతో అన్న మాటలు అతన్ని అలా జైల్లో నిలబెట్టాయి. లేదంటే BB హోటల్ టాస్క్ లో సన్నీ ఇచ్చిన పెరఫార్మెన్స్ ఏ కంటెస్టెంట్ ఇవ్వలేదు.. ఇక శనివారం సన్నీ ఎలిమినేషన్ నుండి ఫస్ట్ సేవ్ అయ్యాడు. అయితే గత రాత్రి అంటే శనివారం ఎపిసోడ్ లో అందరూ ఎక్కువగా సన్నీనే టార్గెట్ చేసారని అనిపించింది. ఎక్కువ బ్యాడ్ గా చూపించారనిపించింది. 

Bigg Boss 5: VJ Sunny was shown to be too bad:

Bigg Boss 5: yesterday Episode Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ