Advertisementt

మెగాస్టార్ సాహసం

Tue 16th Nov 2021 10:14 AM
chiranjeevi,god father movie,bhola shankar movie,chiru 154 movie,acharya movie  మెగాస్టార్ సాహసం
Megastar Adventure మెగాస్టార్ సాహసం
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి కూల్ గా కరోనా టైం లో ఆచార్య మూవీ ని కంప్లీట్ చేసేసారు. రామ్ చరణ్ తో కలిసి నటించిన ఆచార్య మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఇక ఆచార్య తర్వాత గాడ్ ఫాదర్ మూవీ మొదలు పెట్టడం అప్పుడే రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసేసారు. ఇక ఆ మూవీ తో పాటుగా మెగాస్టార్ ఒకేసారి మెహర్ రమేష్ తో భోళా శంకర్ అలాగే బాబీ తో Chiru154 మొదలు పెట్టి కుర్ర హీరోలకి షాకిచ్చారు. అంటే ప్రస్తుతం గాడ్ ఫాదర్ షూటింగ్ జరుగుతన్న సమయంలోనే మెహర్ రమేష్ తో భోళా శంకర్ మూవీ రెగ్యులర్ షూట్ మొదలు పెట్టేసారు. ఈ వయసులో చిరు స్పీడు చూస్తే నిజంగా సాహసమే అనిపిస్తుంది.

ఇక బాబీ తో చిరు154 రెగ్యులర్ షూట్ కూడా త్వరలోనే అంటున్నారు. అంటే ఒకేసారి మెగాస్టార్ మూడు సినిమాల్లో మూడు రకాల వేరియేషన్స్ లో మూడు రకాల గెటప్స్ లో కనిపించబోతున్నారు. గాడ్ ఫాదర్ లో గంభీరంగాను, భోళా శంకర్ లో మాస్ గాను, బాబీ సినిమాలోనూ చిరు ఊర మాస్ గా కనిపించబోతున్నారు. ఒకేసారి మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనడం అంటే.. వయసు రీత్యా కష్టమే.. కానీ చిరు ఎనేర్జి ముందు ఆయన ఏజ్ కూడా కనిపించడం లేదు. మధ్య మధ్యలో వేరే సినిమాల ఈవెంట్స్ చిరు మాములు హడావిడి చెయ్యడం లేదు. 

Megastar Adventure:

High time for Chiranjeevi? Doing three Movies At a time

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ