Advertisementt

అది సమంత రేంజ్

Tue 16th Nov 2021 11:57 AM
samantha,pushpa movie,pushpa special song,samantha latest clicks,samantha new pic  అది సమంత రేంజ్
Samantha remuneration for Pushpa becomes a talking point అది సమంత రేంజ్
Advertisement
Ads by CJ

నాగ చైతన్య తో పెళ్లయిపోయింది.. నాగార్జున కి భయపడి టాప్ హీరోయిన్ గా ఉన్న సమంత కి గ్లామర్ రోల్స్ ఇవ్వడానికి దర్శకులు భయపడుతున్నారనే ప్రచారం మాములుగా జరగలేదు. అయినా సమంత నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలతో సత్తా చాటటమే కాదు.. గ్లామర్ గానూ అదరగొట్టేసింది. కేవలం కమర్షియల్ మూవీస్ కి దూరం ఉంది తప్ప.. కెరీర్ ని పక్కనబెట్టలేదు. పెళ్లయినా సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ పిక్ ని షేర్ చేసే సమంత.. బాలీవుడ్ ఫ్యామిలీ మ్యాన్ 2 లో బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించి షాకిచ్చింది. సూపర్ టాలెంటెడ్ సమంతకి పెళ్ళైనా క్రేజ్ తగ్గలేదు. ఇక రీసెంట్ గా విడాకులు తీసుకున్న సమంత.. క్రేజ్ మరింతగా పెరిగింది కానీ తగ్గలేదు అనడానికి ఉదాహరణ ఆమె ఒప్పుకున్న సినిమాలు, వస్తున్న ఆఫర్స్. శాకుంతలం పాన్ ఇండియా మూవీ కంప్లీట్ చేసిన సమంత.. తెలుగు తమిళంలో ఏకకాలంలో రెండు సినిమాలు చేస్తుంది.

అవంటే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ ఓకె.. కానీ తాజాగా సమంత హాలీవుడ్ మూవీ లో నటించబోతుందట. అంతేకాదు.. ఫస్ట్ టైం అల్లు అర్జున్ తో కలిసి పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో మాస్ స్టెప్స్ వెయ్యబోతుంది. ఇంతవరకు ఐటెం సాంగ్ చెయ్యని సమంత.. పుష్ప లో స్పెషల్ సాంగ్ ఒప్పుకుని అందరికి మాములు షాక్ ఇవ్వలేదు. చైతూ తో డివోర్స్ అయ్యాక సమంత ఫ్రీ బర్డ్ లా మారిపోయింది. అందుకే ఇలా అంటున్నారు. కానీ సమంతకి పుష్ప స్పెషల్ సాంగ్ చేసేందుకు ఏకంగా 1.5 కోట్లు పారితోషకం ఇస్తున్నారు. అందుకే.. సమంత ఈ సాంగ్ చెయ్యడానికి ఒప్పుకుంది అంటున్నారు. మరి ఓ స్పెషల్ సాంగ్ కి 1.5 కోట్ల పారితోషకం అంటే మాములు విషయం కాదు.. అదే కదా సమంత రేంజ్ ని మరింతగా పెంచేసేది. ఇప్పుడు సమంత పుష్ప రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా ఉంది ఇండస్ట్రీలో. 

Samantha remuneration for Pushpa becomes a talking point:

Samantha Pushpa remuneration shocks all

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ