Advertisementt

పవన్ భగత్ సింగ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యిందా

Tue 16th Nov 2021 02:10 PM
pawan kalyan,harish shankar,bhavadeeyudu bhagat singh movie,pawan - harish shankar combo,mythri movie makers  పవన్ భగత్ సింగ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యిందా
Speculation on Pawan Bhavadeeyudu Bhagat Singh release పవన్ భగత్ సింగ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యిందా
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ని సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబో హరిహర వీరమల్లు ఏప్రిల్ లో రిలీజ్ కి రెడీ కాబోతుంది. ఇక పవన్ కళ్యాణ్ ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ కాంబోలో భవదీయుడు భగత్ సింగ్ మూవీ కూడా తెరకెక్కబోతుంది. త్వరలోనే భవదీయుడు భగత్ సింగ్ మూవీని మొదలు పెట్టి రెగ్యులర్ షూట్ కి తీసుకెళ్లే ప్లాన్ లో హరీష్ శంకర్ ఉన్నాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన పూజ హెగ్డే నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబో భవదీయుడు భగత్ సింగ్ మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసారని.. మైత్రి మూవీస్ వారు ఆ డేట్ ని కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా సోషల్ మీడియా టాక్. కమర్షియల్ అంశాలతో పాటు పొలిటికల్ డ్రామా తో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది దసరా సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే 2022 అక్టోబర్ 5న భవదీయుడు భగత్ సింగ్ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. కరోనా పాండమిక్ సిట్యువేషన్ వలన బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు రిలీజ్ డేట్స్ సమస్యగా మారడంతో.. హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ అండ్ మైత్రి వారు ముందే భవదీయుడు భగత్ సింగ్ కి రిలీజ్ డేట్ ప్లాన్ చేసేసి ప్రకటించాలని అనుకునుకుంటున్నారట. 

Speculation on Pawan Bhavadeeyudu Bhagat Singh release:

Pawan Bhavadeeyudu Bhagat Singh release on

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ