ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్. అదేమిటంటే.. సమంత కి స్వేచ్ఛ వచ్చింది అని.. అంటే నాగ చైతన్య తో పెళ్లి తర్వాత సమంత కొన్ని కట్టుబాట్లకు లోబడి సినిమాల్లో నటించింది.. అక్కినేని ఇంటి కోడలయ్యాక గ్లామర్ గా స్టార్ హీరోల అవకాశాలు వచ్చినా సమంత చెయ్యలేదు.. కుటుంబ గౌరవం, నాగ చైతన్య రెస్టిక్షన్స్ మధ్యన సమంత నలిగిపోయింది.. అంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాటలు. అందుకే స్టార్ హీరోల సినిమాల్లో, కమర్షియల్ మూవీస్ లో సమంత నటించలేకపోయింది.. ఇలా ఏవేవో కథలు ప్రచారంలోకి వచ్చాయి. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాతే నాగ చైతన్య కి సమంత కి మధ్యన పొరపొచ్ఛాలొచ్చాయంటున్నారు. ఇదే నిజమనేలా సమంత విడాకుల తర్వాత కెరీర్ ఉంది. రెండు లేడీ ఓరియెంటెడ్ మూవీ తో పాటుగా.. ప్రస్తుతం తమిళనాట ఓ మూవీ లో నటిస్తుంది.
అవన్నీ ఓ ఎత్తయితే సమంత రీసెంట్ గా పుష్ప మూవీ లో ఐటెం సాంగ్ ఒప్పుకుంది. కెరీర్ లో ఎప్పుడు ఇలాంటి ఆలోచనే చెయ్యని సమంత ఇప్పుడు ఇలా స్పెషల్ సాంగ్ అంటుంది అంటే.. ఇలాంటివన్నీ నాగ చైతన్య తో కలిసి ఉన్నప్పుడు మిస్ అయినవే కదా.. మరోపక్క పవన్ కళ్యాణ్ సరసన, మహేష్ బాబు పక్కన సమంత కి ఛాన్సెస్ వచ్చేశాయనే టాక్ మొదలైపోయింది. త్రివిక్రమ్, రాజమౌళి లు సమంత కి తమ సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వబోతున్నారనే ప్రచారం మొదలయ్యింది. మరి చైతూ తో ఉన్నప్పుడు లేని ఆఫర్స్ డివోర్స్ రాగానే వస్తున్నాయంటే.. సమంత ఇప్పుడు స్వేచ్ఛ జీవి.. ఆమె ఎలా ఉన్నా అడిగేవారే లేరనే కదా.. దీని మీనింగ్.. ఇది ఇండస్ట్రీలో జరుగుతూన్న చర్చ.