Advertisementt

హీరోనే మార్చెయ్యమన్న నయనతార

Tue 16th Nov 2021 09:22 PM
nayanthara,chiranjeevi,god father movie,mohan raja,nayanthara conditions,sathya dev,vivek oberoi,choru godfather  హీరోనే మార్చెయ్యమన్న నయనతార
Nayanthara Conditions On Godfather Casting హీరోనే మార్చెయ్యమన్న నయనతార
Advertisement
Ads by CJ

చిరంజీవి - మోహన్ రాజా కాంబోలో మలయాళ లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ చిత్రీకరణ వేగంగా జరిగిపోతుంది. చిరు చేతికి గనక ఆపరేషన్ గనక జరక్కపోతే.. చాలావరకు షూటింగ్ కంప్లీట్ అయ్యేదే. హైదరాబాద్ లోని భారీ సెట్ లోను, అలాగే ఊటీలో గాడ్ ఫాదర్ షూటింగ్ జరిగింది. అయితే ఈ సినిమాలో చిరంజీవి కి హీరోయిన్ సంగతేమో కానీ.. చిరు సిస్టర్ గా అంటే ఒరిజినల్ లూసిఫర్ లో మోహన్ లాల్ చెల్లి మంజు వారియర్ పాత్ర ఉంది. ఇప్పుడు ఆ పాత్రలో కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతార నటిస్తుంది అనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇక విలన్ గా వివేక్ ఒబెరాయ్ పాత్రలో హీరో సత్యదేవ్ కనిపించబోతున్నాడు. అయితే చిరు సిస్టర్ పాత్రలో నయన్ కనిపించడమే పెద్ద విషయం. ఎందుకంటే టాప్ హీరోయిన్ అయ్యుండి సిస్టర్ కేరెక్టర్ లో కనిపించడం.. అది కూడా కాస్త నెగెటివ్ రోల్ లో కనిపించడం షాకింగ్.

భారీ పారితోషకంతో నయనతార ని మేకర్స్ పడేశారని అంటున్నారు. పారితోషకం ఓకె.. అన్ని ఓకె.. కానీ తన భర్త ప్లేస్ లో సత్యదేవ్ అయితే కుదరదని కాస్త పేరున్న హీరోని పెట్టమని గాడ్ ఫాదర్ మేకర్స్ ని నయనతార డిమాండ్ చేస్తుందట. తన రేంజ్ ఏమిటి.. నా రేంజ్ ఏమిటి అని మేకర్స్ తో నయన్ మాట్లాడినట్లుగా టాక్. కానీ మేకర్స్ ఇప్పటికే సత్యదేవ్ - చిరు కాంబో సీన్స్ మొదలు పెట్టడం, ముందు నుండి ఆ పాత్రకి సత్యదేవ్ నే అనుకున్నామని, ఇప్పుడు మార్చడం ఎలా, అలాగే సత్యదేవ్ నెగెటివ్ అండ్ హీరోగానూ ప్రూవ్ చేసుకున్న నటుడు అని నయన్ ని ఒప్పించే పనిలో పడినట్లుగా సమాచారం. 

Nayanthara Conditions On Godfather Casting:

Nayanthara Agrees to Be Satyadev Wife?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ