తెలుగులో అవకాశాలు కోల్పోయిన రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో జెండా పాతడానికి తెగ ఆరాటపడుతుంది. బాలీవుడ్ హీరోయిన్స్ మాదిరి ఒళ్ళు కరిగించి.. సన్నగా స్లిమ్ గా జీరో సైజు ని మెయింటింగ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో యమా యాక్టీవ్ గా ఉంటుంది. ప్రతి విషయాన్నీ రకుల్ ప్రీత్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంది. లేటెస్ట్ ఫొటో షూట్స్, జిమ్ వీడియోస్, ఈమధ్యనే బాయ్ ఫ్రెండ్ ని కూడా సోషల్ మీడియా ద్వారానే అభిమానులకి పరిచయం చేసింది రకుల్. ఇక తాజాగా ఫెమినా మ్యాగజైన్ కవర్ పేజీ పై రకుల్ ప్రీత్ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
NOVEMBERing for Femina Cover ! Check it out now ❤️😁 అంటూ రకుల్ ఆ పిక్ ని షేర్ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ తో.. బ్లాక్ కలర్ లెహంగా తో.. లూజ్ హెయిర్ తో ఎటువంటి ఎక్సప్రెషన్ లేకుండా రకుల్ అలా చూస్తున్న పిక్ తో అట్రాక్ట్ చేస్తుంది. ఇక ఆ ఫెమినా కవర్ పేజీ పై రకుల్ ప్రీత్ సింగ్ షూటింగ్ స్టార్ అంటూ హెడ్డింగ్ కనిపిస్తుంది. అదే కాకుండా లక్నో లో ఇష్టమైన చాట్ తింటున్నట్టుగా కూడా రకుల్ ప్రీత్ ఫొటోస్ షేర్ చేసింది. మరి ప్రస్తుతం రకుల్ లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.