బిగ్ బాస్ సీజన్ 5 కి క్రేజీ యూట్యూబ్ స్టార్ గా అడుగుపెట్టిన షణ్ముఖ్ జాస్వంత్ బిగ్ బాస్ హౌస్ లో ఏదో పీకేస్తాడు అనుకుంటే.. నిన్నమొన్న కెప్టెన్ అయ్యేవరకు ఒక్క టాస్క్ బాగా ఆడలేదు. జెస్సి, సిరి లని అడ్డం పెట్టుకుని నెట్టుకొచ్చేసాడు. ఫాన్స్ వలన ఎలిమినేట్ అవ్వకుండా బ్రతికిపోయాడు. ఇక సిరి - షణ్ముఖ్ ల ఫ్రెండ్ షిప్ ఎలా ఉందో బుల్లితెర ప్రేక్షకులు కూడా చూసారు.. ఒకొనొక సందర్భంలో అందరికి వాళ్ళ ఫ్రెండ్ షిప్ బోర్ కొట్టేసింది. ఇక మధ్యలో కొట్లాటలు, అలగడాలు అమ్మో ఇలా షణ్ముఖ్ - సిరి ఫ్రెండ్ షిప్ బోలెడన్ని వేరియేషన్స్ చూపించేసారు. ఇక షణ్ముఖ్ ఎక్కువగా యాటిట్యూడ్ చూపించడమే కాదు, కాస్త సెల్ఫిష్ గాను ఉంటున్నాడు.
సిరి ఏం చేసినా తప్పు అంటాడు, నిన్న రాత్రి ఎపిసోడ్ లో నువ్వు నీ కోసం గేమ్ ఆడుతున్నావ్.. వెళ్ళు, నాదే తప్పు.. నీదే కరెక్ట్ అంటూ సిరిని బాగా ఏడిపించాడు. షణ్ముఖ్ నాకు ఒంటరిగా ఉండాలని ఉంది.. నువ్వు వెళ్ళిపో.. ప్లీజ్ నన్ను వదిలేయ్ అనడంతో.. షణ్ముఖ్ - సిరి ల మధ్య జరిగిన డిస్కర్షన్ కి సిరి తలా బాదేసుకుని ఏడ్చేసి రంపు రంపు చేసేసింది. నాకు దీపు చాలా గుర్తుకు వస్తుంది.. అందుకే చాలా ఎలోన్ గా ఉన్నాను అంటూ షణ్ముఖ్ తెగ ఫీలైపోయాడు. దీపు ఉంటే అలా చేసేది ఇలా చేసేది.. అంటూ ఏడ్చేశాడు. సిరి ఓదార్చినా.. ప్లీజ్ నన్ను వదిలేయ్, నేను ఏడ్చినా నీ మూలంగా కాదు.. నిన్ను నెగెటివ్ చెయ్యడం లేదు అని షణ్ముఖ్ అనగానే.. ఏడుస్తూ బాత్ రూమ్ కి వెళ్లి డోర్ లాక్ చేసుకుని డ్రామా చేసింది సిరి.
వాష్ రూమ్ లో ఉన్న సిరి గోడకి తలని బాదేసుకుంది.. అంతలో రవి, షణ్ముఖ్ డోర్ గట్టిగా కొట్టడంతో డోర్ తీసిన సిరి.. ఏడ్చేసింది. తర్వాత ఏడుస్తున్న సిరిని చచ్చినట్టుగా మళ్ళీ షణ్ముఖ్ సిరిని ఓదార్చాడు.. దానితో నెటిజెన్స్ అంతా సిరిని, షణ్ముఖ్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు..వీళ్ళ ఓవేరేక్షన్ చూడలేకపోతున్నాం అని .. కావాలనే డ్రామా చేస్తున్నారు వీళ్ళు అంటూ ఏకి పడేస్తున్నారు.