Advertisementt

అనుభవించు రాజా ట్రైలర్ టాక్

Wed 17th Nov 2021 11:55 AM
raj tarun,anubhavinchu raja trailer,raj tarun anubhavinchu raja,anubhavinchu raja movie  అనుభవించు రాజా ట్రైలర్ టాక్
Anubhavinchu Raja trailer talk అనుభవించు రాజా ట్రైలర్ టాక్
Advertisement
Ads by CJ

రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ అనుభవించు రాజా.. ఈ సినిమా నవంబర్ 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీ‌ను గ‌విరెడ్డి డైరెక్షన్ లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో రాబోతున్న ఈ సినిమా పై మంచి అంచనాలున్నాయి. అనుభవించు రాజా ప్రమోషన్స్ లో భాగంగా పోస్టర్స్, సాంగ్స్ తో అంచనాలు పెంచుతున్న టీం తాజాగా.. ట్రైలర్ ని నాగార్జున అక్కినేని చేతుల మీదుగా రిలీజ్ చేసింది. అనుభవించు రాజా ట్రైలర్ లోకి వెళితే.. రాజ్ తరుణ్ చిన్నప్పటి నుండే దసరా బుల్లోడిలా.. అనుభవించు రాజా అన్న టైప్ లో ఉంటాడు.. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్ జాబ్ లో జాయిన్ అవుతాడు. హీరోయిన్ బాబు రాజా.. సెక్యూరిటీ గార్డ్ నుండి నీ ఒరిజినల్ కేరెక్టర్ బయటికి తియ్యమనగానే.. మనోడు ఫ్లాష్ బ్యాగ్ లోకి వెళ్ళిపోతాడు.

పంచె కట్టి పందేలు కాస్తూ.. బంగారం గాడి మనసు.. సినిమా హాల్లాంటిది.. వారానికో సినిమా వస్తా ఉంటుంది.. పోతా ఉంటుంది..ఏది పర్మినెంట్ గా ఆడదిక్కడ . అయినా మనూరిలో మనకంటే పోటుగాడు ఎవరున్నారండి.. అంటూ కోడి పందేలతో ఎంజాయ్ చేసే రాజ్ తరుణ్ కేరెక్టర్ కామెడీ గా అల్లుకుపోయింది. రాజ్ తరుణ్ మాత్రం అనుభవించు రాజా అంటూ ఆ కేరెక్టర్ లో ఇరగ దీసాడు. ఇక అజయ్, ఆదర్శ్ బాలకృష్ణ విలనిజం, వ‌చ్చే సంవ‌త్స‌రం ఇదే రోజు.. ఇక్క‌డే జెండా ఎగ‌రేస్తా.. బంగారంగా కాదు. ప్రెసెడెంటు బంగారంగా.. ఏయ్‌రా.. నామినేష‌ను అనే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. విలేజ్ నేపథ్యంలో.. కామెడీ ఎంటర్టైనర్ గా అనుభవించు రాజా ప్రేక్షకుల ముందురావడానికి రెడీ అయ్యిపోయింది. 

అనుభవించు రాజా ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

 

Anubhavinchu Raja trailer talk:

Raj Tarun Anubhavinchu Raja trailer talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ