Advertisementt

భర్త మరణం తర్వాత పునీత్ భార్య ఫస్ట్ పోస్ట్

Wed 17th Nov 2021 05:21 PM
puneet rajkumar,wife ashwini first post,husband puneeth death,ashwini wrote an emotional post,puneeth fans  భర్త మరణం తర్వాత పునీత్ భార్య ఫస్ట్ పోస్ట్
Puneet Rajkumar wife Ashwini wrote an emotional post భర్త మరణం తర్వాత పునీత్ భార్య ఫస్ట్ పోస్ట్
Advertisement
Ads by CJ

గత నెలలో కన్నడ టాప్ హీరో పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో ఆయన కుటుంబమే కాదు.. పునీత్ అభిమానులు షాకయ్యారు.. పునీత్ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురయ్యి మొత్తం బెంగుళూరుకి క్యూ కట్టింది. పునీత్ మరణం తర్వాత యన సమాధిని సందర్చించే సెలబ్రిటీస్, అభిమానుల తాకిడి ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న మంగళవారం పునీత్ రాజ్ కుమార్ సంస్కరణ సభకి తమిళ హీరోలు హాజరయ్యారు. ఇక భర్త మరణంతో కుంగిపోయిన.. పునీత్ భార్య అశ్విని తొలిసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అది కూడా తనకి ఇంస్టాగ్రామ్ అకౌంట్ లేకపోయినా.. దానిని ఓపెన్ చేసి.. అందులో భర్తకి అంకితమిస్తూ ఫస్ట్ పోస్ట్ పెట్టారు.

పునీత్ మరణం మా కుటుంబానికే కాదు, అభిమానులకి, యావత్ కర్ణాటక ప్రజలకు షాకింగ్ గా ఉంది. ఆయనని పవర్ స్టార్ గా పిలుచుకునే అభిమానులకి ఆయన లోటుని పూడ్చడం కష్టమే. ఇంతటి కష్టమైన సమయంలోనే లోనే మీరు ధైర్యంతో.. గుండె నిబ్బరంతో.. మనో నిబ్బరం కోల్పోకుండా ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు తావివ్వకుండా పునీత్ కి చాలా గౌరవంగా అంతిమ వీడ్కోలు పలికారు. ఆయన అభిమానులు, ప్రేక్షకులే కాదు.. ఇండియా నుండి, అలాగే విదేశాల నుండి పునీత్ కి నివాళులు అర్పించేందుకు వచ్చారు. పునీత్ చేసిన నేత్రదానానికి ఇన్స్పైర్ అయ్యి.. ఆయన అభిమానులు వేలాదిగా ముందుకు రావడంతో.. మీ మనసులో ఆయన స్థానాన్ని చూసి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరు ఏ మంచి పని చేసినా.. అందులో పునీత్ ఎప్పటికి బ్రతికే ఉంటారు. మా కుటుంబానికి అండగా నిలిచిన అభిమానులకి కృతజ్ఞతలు అంటూ ఆ పోస్ట్ ని పునీత్ రాజ్ కుమార్ కి అంకితమిచ్చారు అశ్విని.

Puneet Rajkumar wife Ashwini wrote an emotional post:

Puneet wife first post after husband Puneeth death 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ