రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తో రికార్డులు కొల్లగొట్టడానికి రెడీ అయ్యారు. జనవరి 7 న ఆర్.ఆర్.ఆర్ తో ఇండియన్ బాక్సాఫీసుని షేక్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే రిలీజ్ అయిన దోస్తీ, నాటు నాటు సాంగ్స్ ఫాన్స్ కి, ప్రేక్షకులకి విపరీతంగా ఎక్కేశాయి.. ఇంకా నెలన్నర మాత్రమే రిలీజ్ కి టైం ఉన్న ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో చెయ్యబోతున్నారు. దుబాయ్ వేదికగా ఆర్.ఆర్.ఆర్ బిగ్గెస్ట్ ఈవెంట్ ప్లాన్ చేసిన రాజమౌళి.. ఇండియాలోని పేరున్న సిటీస్ లో ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్స్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక రిలీజ్ రోజే ఆర్.ఆర్.ఆర్ తో రికార్డులను సెట్ చెయ్యడానికి రాజమౌళి కాచుకుని కూర్చున్నారు. .
వరల్డ్ వైడ్ గా ఆర్.ఆర్.ఆర్ మూవీ జనవరి 7 అత్యధిక థియేటర్స్ లో విడుదల అవుతున్న భారతీయ సినిమా సరికొత్త రికార్డును క్రియేట్ చేయబోతోంది. వరల్డ్ వైడ్ గా ఆర్.ఆర్.ఆర్ ని దాదాపు 10 వేలకు పైగా స్క్రీన్లలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఆర్.ఆర్.ఆర్ ఫస్డ్ డే కలెక్షన్స్ తోనే ఆర్.ఆర్.ఆర్ చరిత్ర సృష్టించేలా చేస్తున్నారు. అంతేకాకుండా ఓవర్సీస్ లోను ఆర్.ఆర్.ఆర్ ప్రీమియర్స్ తోనే రికార్డ్ సృష్టించెయ్యాలని వెయిటింగ్ అంటున్నారు. యూఎస్ లో దాదాపుగా 2,500 స్క్రీన్ లలో RRR సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అసలు ఇదంతా ఎందుకు ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రపంచంలో ఉన్న థియేటర్స్ మొత్తాన్ని కబ్జా చెయ్యడం ఖాయమంటున్నారు ఆర్.ఆర్.ఆర్ ఫాన్స్. దీనిని బట్టి ఫస్ట్ డే ఆర్.ఆర్.ఆర్ మూవీ రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందని ఈజీగా చెప్పవచ్చు.