బిగ్ బాస్ సీజన్ 5 లో 11వ వారం కెప్టెన్సీ టాస్క్ ఆహ్లాదంగా జరిగినా.. మధ్యలో సన్నీ - మానస్ ల లేబుల్ ఫైట్ ఫ్రెండ్స్ మధ్యలో చిచ్చు పెట్టింది. మానస్ కి - సన్నీకి మధ్యన కాస్త గొడవైతే జరిగింది. ఇక స్టార్ మా నుండి ఈ రోజు ఎపిసోడ్ కి సంబందించిన మరో ప్రోమో రిలీజ్ చేసారు. అందులో నీ ఇల్లు బంగారం కానూ అంటూ.. ఎల్లో టోపీని మానస్, శ్రీరామ్, సిరి, సన్నీ లు చేజిక్కించుకుని.. గోల్డ్ బాల్స్ ఏరుకున్నారు. ఇక పవర్ రూమ్ కి సిగ్నల్ రాగానే.. పవర్ యాక్సిస్ ని శ్రీరామ్ సొంతం చేసుకున్నాడు.. లోపలకి వెళ్లిన శ్రీరామ్ కి బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు.. మేము ఇచ్చే పవర్ టూల్ ని మీరు సొంతం చేసుకుంటారా.. ఇంట్లో ఎవరికైనా ఇస్తారా అనగానే శ్రీరామ్ ఎవ్వరికి ఇవ్వను నేనే ఉంచుకుంటాను అని చెప్పాడు.
పవర్ రూమ్ నుండి బయటికి వచ్చి పవర్ టూల్ హౌస్ మేట్స్ మధ్యన బేరం పెట్టాడు. నా దగ్గర ఉన్న పవర్ టూల్ ఎవరి కన్నా కావాలి చదివే ముందు అంటే.. మీ కాయిన్స్ నాకివ్వాలి అన్నాడు.. దానికి మానస్ ఆల్రెడీ మిమ్మల్ని బిగ్ బాస్ అడిగే ఉంటారు కదా అనగా.. ఇది నా డీల్ నా ఇష్టం అన్నాడు శ్రీరామ్. మీకు కావాలంటే తీసుకోండి అన్నాడు శ్రీరామ్. 50 గోల్డ్ నాకిస్తారా అనగానే కెప్టెన్ రవి నేనిచ్చెస్తాను అనగానే.. ఆని మాస్టర్ దేవుడా ఈ టెంక్షన్ భరించడం కష్టముగా ఉంది అంది. ఆ తర్వాత పవర్ టూల్ ని రవి కి ఇచ్చేయగా దాన్ని తీసుకున్న రవి అసలు మేటర్ చదివి డిస్పాయింట్ అవ్వగా.. శ్రీరామ్, కాజల్ ఇంకా హౌస్ మేట్స్ విరగబడి నవ్విన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. రవిని అడ్డంగా మోసం చేసిన శ్రీరామ్ అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.