Advertisementt

శ్యామ్ సింగ రాయ్ టీజర్ టాక్

Thu 18th Nov 2021 10:49 AM
shyam singha roy,shyam singha roy teaser,natural star nani,rahul sankartiyan,kolkota,west bengal,sai pallavi,kriti shetty and madonna sebastian  శ్యామ్ సింగ రాయ్ టీజర్ టాక్
Shyam Singha Roy teaser talk శ్యామ్ సింగ రాయ్ టీజర్ టాక్
Advertisement
Ads by CJ

నేచురల్ స్టార్ నాని ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందు సందడి చెయ్యబోతున్నాడు. ఇప్పటికే టక్ జగదీశ్ తో వచ్చిన నాని.. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ తో రాబోతున్నాడు. నాని - సాయి పల్లవి - కృతి శెట్టి జంటగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ క్రిష్ట్మస్ స్పెషల్ గా డిసెంబర్ 24 న రిలీజ్ కి పలు భాషల్లో పాన్ ఇండియా ఫిలిం గా సిద్ధమైంది. తాజాగా శ్యామ్ సింగరాయ్ టీజర్ రివీల్ చేసారు మేకర్స్. శ్యామ్ సింగరాయ్ మూవీ లుక్స్ తోనే సినిమాపై విపరీతమైన అటెంక్షన్ క్రియేట్ చేసిన టీం.. ఇప్పుడు టీజర్ విషయంలోనూ గత వారం రోజులుగా అదే ఆసక్తిని క్రియేట్ చేసింది.

ఇక టీజర్ లోకి వెళితే.. అడిగే అండ లేద‌ని క‌ల‌బ‌డే కండ‌లేద‌ని ర‌క్షించాల్సిన దేవుడు రాక్ష‌సుడిగా మారుతుంటే.. కాగితం క‌డుపుని చీల్చుకుని పుట్టి రాయ‌డ‌మే కాదు.. కాల రాయ‌డం కూడా తెలుస‌ని అక్ష‌రం ప‌ట్టుకున్న ఆయుధం పేరే… శ్యామ్ సింగ‌రాయ్‌.. అంటూ నాని కేరెక్టర్ ని రివీల్ చేసారు. అంతేకాకుండా నాని బెంగాలీ భాషలో చెప్పే స్త్రీ ఎవ‌రికీ దాసీ కాదు.. ఆఖ‌రికి దేవుడికి కూడా అంటూ చెప్పే డైలాగ్ (తెలుగు సబ్ టైటిల్స్) ఆకట్టుకునేలా ఉంది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి క్లాసికల్ డాన్సర్ గాను, కృతి శెట్టి మోడరన్ గాను కనిపిస్తున్నారు.. ఇక నాని తో సాయి పల్లవి ఓ షాట్ లో రొమాంటిక్ గా కనిపించగా.. కృతి శెట్టి అయితే నానికి ఏకంగా ముద్దు పెట్టేసింది. మిక్కీ జే మేయ‌ర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, అన్ని సినిమాకి ప్లస్ పాయింట్స్ గా కనిపిస్తున్నాయి. 

Shyam Singha Roy teaser talk:

Shyam Singha Roy teaser creates a powerful impact

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ