గత రాత్రి కెప్టెన్సీ టాస్క్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన మానస్ - సున్ని - కాజల్ మధ్యన అగ్గి రాజేసింది. సన్నీ టి షర్ట్ లేబుల్ గొడవలో కాజల్ కలగజేసుకుంది.. ఎప్పుడూ నన్ను ఇలానే చేస్తారా అంటూ సన్నీ ఫైర్ అయ్యాడు. రవి సంచాలక్ గా తీసుకున్న నిర్ణయం సన్నీకి నచ్చలేదు. మానస్ సర్ది చెప్పడంతో సన్నీ హార్ట్ అయ్యాడు. ఇక కాజల్ ని ఫ్రెండ్ గా వద్దు అనగానే కాజల్ ఏడుస్తుంది.. ఈ రోజు ఎపిసోడ్ లో కాజల్ తనని సన్నీ అవాయిడ్ చేస్తున్నాడనే కారణంతో కన్నీళ్లు పెట్టుకుంది. తాజా ప్రోమోలో యాంకర్ రవి పవర్ రూమ్ యాక్సిస్ పొంది.. పవర్ టూల్ ని ఎవరికిస్తారు అని బిగ్ బాస్ అడగగానే నేను సన్నీకి ఇస్తాను అన్నాడు రవి. అది తీసుకుని బయటికి వచ్చిన రవి ఈ టూల్ సన్నీకి ఇస్తున్నాను అనగానే.. సన్నీ మాత్రం నాకు వద్దు నేను తీసుకోను అన్నాడు.
కుదరదు నీ పేరే చెప్పాను నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి అనగానే.. ఎందుకు నాకు ఇది అంటూ సన్నీ తీసుకున్నాడు. దానికి గాను సగం గోల్డ్ బాల్స్ రవికి ఇచ్చేసాడు. తదుపరి సైరన్ వచ్చినప్పుడు ఒకరిని తొలగించి ఆ స్థానంలో నువ్వు మైన్ లోకి దిగాలి అని సన్నీ ఆ బుక్ చదివాక, సంచాలక్ ఈ పవర్ ని నేను వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నా అనగానే రవి.. నువ్వు దిగాలా అన్నాడు. దానితో సన్నీ ఒంటరిగా కూర్చుని బిగ్ బాస్ సర్.. ఆయనకి సంచలక్ గా ఎందుకు సర్, స్ట్రిట్ సంచాలక్ కూడా ఇంత బిల్డప్ ఇయ్యడు. నన్ను రెచ్చగొట్టి పంపిస్తారు. లాస్ట్ కి ఎర్రి పుష్పాన్ని చేస్తారు. బికాస్ ఐయామ్ ఏ పూర్ బాయ్ అంటూ సన్నీ బాధపడుతున్న ప్రోమో ని రివీల్ చేసింది స్టార్ మా.