Advertisementt

అఖండ సెలెబ్రేషన్స్ అక్కడినుండే..

Thu 18th Nov 2021 07:02 PM
balakrishna,akhanda movie,boyapti,balayya balakrishna akhanda,balakrishna akhanda,akhanda pre-release event details  అఖండ సెలెబ్రేషన్స్ అక్కడినుండే..
Special plan for Akhanda pre release event అఖండ సెలెబ్రేషన్స్ అక్కడినుండే..
Advertisement
Ads by CJ

బాలకృష్ణ - బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న అఖండ మూవీ డిసెంబర్ 2 న థియేటర్స్ దుమ్ము దులపడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే అఖండ రిలీజ్ ప్రమోషన్స్ అదిరిపోయే అఖండ ట్రైలర్ తో మొదలైపోయాయి. బాలయ్య లోని అన్ని వేరియేషన్స్ ని అఖండ ట్రైలర్ ద్వారా రివీల్ చేసేసారు. శ్రీకాంత్ ని మాస్ విలన్ గాను, బాలకృష్ణ ని అఘోరాగాను, స్టైలిష్ గాను చూపించారు బోయపాటి, బాలయ్య పక్కన ప్రగ్య జైస్వాల్ బ్యూటిఫుల్ గా రొమాంటిక్ గా కనిపిస్తుంది. ఇక డిసెంబర్ 2 న విడుదల కాబోతున్న అఖండ మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ ని భారీ ఎత్తున నిర్వహించేందుకు అఖండ టీం ప్లాన్ చేస్తుందట.

అందులో భాగంగానే అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా వైజాగ్ లో నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది.. నవంబర్ 27 న కానీ 28 న కానీ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అభిమానుల కోలాహలం మధ్యన ఏర్పాటు చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయమై రెండు మూడు రోజుల్లో అఫీషియల్ గా ప్రకటన వస్తుంది అని అంటున్నారు. ఇక బాలయ్య - బోయపాటి ల కాంబోలో హ్యాట్రిక్ మూవీ కావడం, అఖండ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 

Special plan for Akhanda pre release event:

Balakrishna Akhanda pre-release event details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ