Advertisementt

బిగ్ బాస్ 5: మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది

Thu 18th Nov 2021 07:40 PM
anchor ravi,caution,siri,shanmukh,siri-shanmukh relation,bigg boss telugu,bigg boss  బిగ్ బాస్ 5: మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది
Bigg Boss 5: Anchor Ravi Caution To Siri-Shanmukh బిగ్ బాస్ 5: మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ లో ఫ్రెండ్స్ అంటూ కలర్ ఇస్తున్న షణ్ముఖ్ - సిరి లను ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ బయటికి వచ్చాక నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వారిద్దరి ఫ్రెండ్ షిప్ వలన, కలిసి గేమ్ ఆడడం వలనే మేము ఎలిమినేట్ అయ్యాం.. వారి వలన జీవితాలే నాశనం అవుతాయి అంటూ సన్సెషనల్ గా మాట్లాడుతున్నారు. ఇక తాజాగా ఉమాదేవి హౌస్ లో ఇంకా మాస్క్ ల్లో తిరుగుతుంది.. సిరి, షణ్ముఖ్, రవి, అని మాస్టర్ అని చెప్పింది. అయితే సిరి - షణ్ముఖ్ ల ఫ్రెండ్ షిప్ అంతకు మించి అనేలా ఉంది. సిరి టాస్క్ ల్లో రెచ్చిపోయి ఆడినా.. షణ్ముఖ్ ఆటిట్యూడ్ చూపించడం, పెత్తనం చెలాయించడం మాత్రం చేస్తాడు. టాస్క్ ఆడడం రాదు. జెస్సి కూడా సిరి షణ్ముఖ్ ని భరిస్తుంది అంటూ సెన్సేషనల్ గా మాట్లాడాడు. అయితే సిరి - షణ్ముఖ్ ల మధ్యన జరిగిన ఓ చిన్న గొడవ తో సిరి వాష్ రూమ్ లాక్ చేసుకుని తల గోడకు కొట్టుకోవడం హౌస్ మేట్స్ నే కాదు, బుల్లితెర ప్రేక్షకులని అయోమయానికి గురి చేసింది.

అందుకే రవి సిరి దగ్గరకి వచ్చి.. సిరి, షణ్ముఖ్ కి నీకు మధ్యలో ఏం జరుగుతుందో నాకేం అర్ధం కావడం లేదు.. ఫ్రెండ్ షిప్ అయితే ఓకె.. కానీ అంతకు మించి అనేలా ఉంది.. దానికి సిరి మా ఇద్దరి మధ్యన ఎమోషనల్ బాండింగ్ వచ్చేసింది. నాది తప్పని షణ్ముఖ్ అంటున్నాడు.. నువ్వేమో నాదే తప్పు అంటున్నావ్.. నాకేమి అర్ధం కావడం లేదు అని రవి అన్నాడు. ఒకరి కోసం ఒకరు ఏం చెయ్యడానికైనా, చేసుకోవడానికైనా రెడీగా ఉన్నారు. అదే అర్ధం కావడం లేదు చూసుకోండి అనగానే.. దానికి సిరి షణ్ముఖ్ నాపై ఎందుకో ఊరికే కోపం తెచ్చుకుంటున్నాడు.. అదే నాకు అర్ధం కావడం లేదు అంది.. సో వారి మధ్యన ఏం జరుగుతుందో ఎవరికీ ఓ పట్టాన అర్ధమే కావడం లేదు.

Bigg Boss 5: Anchor Ravi Caution To Siri-Shanmukh:

Anchor Ravi Caution To Siri-Shanmukh relation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ