Advertisementt

అంతా అఖండ చేతుల్లోనే

Fri 19th Nov 2021 11:18 AM
akhanda movie,balakrishna,big movies,akhanda december 2,everything is in akhanda hands,ghani,pushpa  అంతా అఖండ చేతుల్లోనే
Everything is in Akhanda hands అంతా అఖండ చేతుల్లోనే
Advertisement
Ads by CJ

కరోనా క్రైసిస్ తో థియేటర్స్ మూత బడడం, మళ్ళీ జులై లో తెరుచుకున్న థియేటర్స్ నుండి చిన్నా, చితక మీడియం బడ్జెట్ మూవీస్ తో సరిపెట్టుకున్న ప్రేక్షకులకి అఖండ తో ఆశలు రేపుతున్నారు మేకర్స్. బలకృష్ణ - బోయపాటి కాంబోలో భారీ బడ్జెట్ మూవీ గా తెరకెక్కిన అఖండ మూవీ డిసెంబర్ 2న గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతుంది. పక్కా మాస్ కమర్షియల్ మూవీ గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు, ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది.  అఖండ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. థియేటర్స్ లో అఖండ ప్రభంజనంతో పెద్ద సినిమాలు ఊపిరి పీల్చుకోవచ్చని బడా నిర్మాతలు చూస్తున్నారు. 

అఖండ కలెక్షన్స్ తో మళ్ళీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ గలగలలు వినిపిస్తాయని.. ఇప్పటివరకు రాజరాజ చోర, లవ్ స్టోరీ, రిపబ్లిక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సీటిమార్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద సత్తా చాటినా.. ఆ సినిమాలు మీడియం బడ్జెట్ మూవీస్.. వాటికే ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ బావుంది. ఇక థియేటర్స్ దగ్గర పెద్ద సినిమాల సందడి మాత్రం అఖండ నుండే మొదలు కాబోతుంది. ఇండస్ట్రీ వారు, ఆడియన్స్ అంతా ఇప్పుడు అఖండ వైపే చూస్తున్నారు. భారీ అంచనాలు నడుమ భారీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖండ మూవీకి హిట్ టాక్ పడిందా.. ఇక కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించడం ఖాయంగా చెబుతున్నారు. అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వైజాగ్ లో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవర్సీస్ లో అఖండ ని సినీమార్క్ భారీ ఎత్తున రిలీజ్ చేయబోతుంది. డిసెంబర్ 1 సాయంత్రం 6 గంటల నుండే యుఎస్ ప్రీమియర్స్ తో అఖండ ప్రభంజనం మొదలు కాబోతుంది. 

Everything is in Akhanda hands:

Akhanda US premieres confirmed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ