టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. అసెంబ్లీలో వైసిపీ మంత్రులు వ్యక్తిగత దూషణలకు దిగడమే కాకుండా.. కుటుంబ సబ్యులని కించపరుస్తున్నారని, ఇంట్లో మహిళలను కూడా వదలకుండా వ్యక్తిగత దాడి చేయటం పై చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో వైసిపి మంత్రి కొడాలి నాని చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని వ్యక్తిగతంగా దూషించడం పై చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాకుండా.. మళ్ళీ ముఖ్యమంత్రి గానే అసెంబ్లీ కి వస్తా.. మళ్లీ గెలిచాకే అసెంబ్లీ లో అడుగు పెడతా అంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన భార్యని వ్యక్తిగతంగా వైసిపి మంత్రి తీవ్రంగా దూషించడంపై మీడియా ఎదుటే చంద్రబాబు భోరున విలపించారు. వెక్కి వెక్కి ఏడవడం టీడీపీ నేతలను కంటతడి పెట్టించింది. టిడిపి కార్యకర్తలు, టిడిపి అభిమానులకు చంద్రబాబు కంటతడి పెట్టడం షాక్ కి గురిచేసింది. కొడాలి నాని చంద్రబాబు భార్య భువనేశ్వరిని నోటికొచ్చినట్లుగా మాట్లాడినా.. స్పీకర్ తమ్మినేని ఏమి అనకపోవడం, స్పీకర్ కూడా మౌనంగా ఉంటూ వైసీపీని కట్టడి చేయడం లేదు, సభలో జరిగిన పరిణామాలు చూస్తోంటే తీవ్ర ఆవేదన కలుగుతోందన్న చంద్రబాబు మీడియా ఎదుట ఎక్కి ఎక్కి ఏడవడం అందరిని కలిచివేసింది.
తాను ఓడిపోయినప్పుడు కూడా ఇంతగా బాధపడలేదని, కానీ గత రెండున్నరేళ్లుగా టీడీపీ కార్యకర్తలని, నేతలని తనని వైసిపీ నోటికి వచ్చినట్టుగా తిడుతుంది అని, కానీ తన భార్య ఇంతవరకు రాజకీయాల్లోకి రాకపోయినా.. తన భార్యని దూషిస్తున్నారని, ఇంతవరకు ఇంతటి ఘోర అవమానం జరగలేదని చంద్రబాబు మీడియా ఎదుట భోరున విలపించారు.