బిగ్ బాస్ సీజన్ 5 లోకి టైటిల్ ఫెవరెట్ గా దిగిన యాంకర్ రవి.. మధ్యలో కాస్త డల్ అయినా.. గేమ్ స్ట్రాటజీ తో.. హౌస్ మేట్స్ తో కలిసిపోయాడు. డీప్ ఫ్రెండ్స్ అంటూ ఎవరితోనూ బాండింగ్ పెట్టుకోకపోయినా.. అందరితో మంచిగానే ఉంటున్నాడు. గతంలో బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన నటరాజ్ మాస్టర్ రవి ని గుంటనక్క అన్నపప్టికి, కొంతమంది రవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని అన్నా. అది రవి గేమ్ స్ట్రాటజీనే. లహరి విషయంలో రవి తప్పులేకపోయినా, అతని మాట మార్చడంతో అక్కడ కాస్త నెగెటివ్ అయినా.. మళ్ళీ పుంజుకున్నాడు. కాజల్ తో ఫ్రెండ్ షిప్ తో గొడవ పడుతుండే.. రవి టాప్ 5 లో ఖచ్చితంగా ఉండబోతున్నాడనిపిస్తుంది.
అయితే రవి భార్య నిత్య భర్త రవి కి సపోర్ట్ గా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది అలాగే రవి పిఆర్ టీం కూడా రవి కి బాగానే పబ్లిసిటీ చేస్తున్నారు. అయితే రవి అంటే పొగిడేవాళ్లు ఉన్నారు. రవి అంటే గిట్టని వాళ్ళు ఉన్నారు. అందులో రవి అంటే గిట్టని వాళ్ళు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ తెరిచి రవిని, అతని ఫ్యామిలీ అంటే భార్య, బిడ్డని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఓ వర్గం.. యాంకర్ రవిని టార్గెట్ చేసి, ట్రోల్ చేయడం మొదలెట్టింది. కేవలం రవిని మాత్రమే కాకుండా.. అతని ఫ్యామిలీని కూడా కించపరచడంతో.. రవి భార్య నిత్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు, పిల్లల పేరు కూడా ఈ ట్రోల్స్ లోకి తీసుకొస్తున్నారు. ఇది గేమ్ స్పిరిట్ కాదు.. రవిని పడెయ్యడం కోసం తన ఫ్యామిలీని కించపరచడం కరెక్ట్ కాదు అంటూ ఆమె వాపోతుంది.