Advertisementt

డల్ వీకెండ్

Mon 22nd Nov 2021 10:02 AM
ram asur,chalo premiddam,missing,adhbutam,oka chinna family story,movies  డల్ వీకెండ్
Boring Weekend డల్ వీకెండ్
Advertisement
Ads by CJ

గత శుక్రవారం రాజా విక్రమార్క, పుష్పక విమానం సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. ఆ సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఆనంద దేవరకొండ - కార్తికేయ ఇద్దరూ ప్రేక్షకులని శాటిస్ఫై చేయలేకపోయారు. ఇక ఈ వారం రామ్ అసుర, మిస్సింగ్, చలో ప్రేమిద్దాం, ఉరికి ఉత్తరాన అనే సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్లాప్ టాక్ తెచ్చుకోగా.. ఓటిటి నుండి అద్భుతం హాట్ స్టార్ లోను, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ జీ 5 నుండి రిలీజ్ అయ్యాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలేవీ ప్రేక్షకులకు రుచించలేదు.

ఇక ఓటిటి లో అద్భుతం అద్భుతం అనిపించేలా కాకుండా.. బాబోయ్ అనిపించేలా ఉంది అని, జీ 5 లో రిలీజ్ అయిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ మాత్రం కాస్త చూసే విధంగా ఉంది అని అంటున్నారు. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు చూసిన ప్రేక్షకులు బాబోయ్.. ఈ వారమేమిటి సామీ అంటున్నారు. గత వారం, ఈ వారం రెండు వారలు ప్రేక్షకులని నిరాశపరిచాయి. దానితో డల్ ఫ్రైడే, డల్ వీకెండ్ అంటూ ప్రేక్షకులు బాగా బోర్ ఫీలవుతున్నారు. మరి వచ్చే వారం రాబోతున్న రాజ్ తరుణ్ అనుభవించు రాజా పై కాస్త అంచనాలు ఉన్నాయి. వరస సినిమాల ప్లాప్ లతో ఉన్న రాజ్ తరుణ్ అయినా.. ప్రేక్షకుల బోర్ దూరం చేస్తాడేమో చూడాలి.  

 

 

Boring Weekend:

Boring talking audience

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ