Advertisementt

బాలీవుడ్ ఎంట్రీ పై సమంత ఫుల్ క్లారిటీ

Mon 22nd Nov 2021 03:17 PM
samantha,bollywood debut entry,samantha news,samantha photos,samantha latest  బాలీవుడ్ ఎంట్రీ పై సమంత ఫుల్ క్లారిటీ
Samantha Full Clarity on Bollywood Entry బాలీవుడ్ ఎంట్రీ పై సమంత ఫుల్ క్లారిటీ
Advertisement
Ads by CJ

నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత కెరీర్ ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతుంది. రెండు సినిమాలను లైన్ లో పెట్టిన సమంత.. ప్రస్తుతం పుష్ప ఐటెం సాంగ్ షూట్ పూర్తి చేసేసింది. అంతేకాదు.. గోవాలో జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో పాన్ ఇండియా వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2 తో సత్తా చాటింది. ఇక తాజాగా సమంత బాలీవుడ్ ఎంట్రీ పై బోలెడన్ని న్యూస్ లు వస్తున్నాయి. షారుఖ్ - అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న లయన్ మూవీలో నయన్ ప్లేస్ లో సమంత బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.. అంటూ వార్తలు వండి విరుస్తున్నారు. అయితే తాజాగా సమంత బాలీవుడ్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేసింది.

మంచి కథ, మంచి స్క్రిప్ట్ వస్తే.. బాలీవుడ్ లో త్వరలోనే ఎంట్రీ ఇస్తాను. నాకు కూడా బాలీవుడ్ మూవీస్ చెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉంది. అసలైతే ఏ ప్రాజెక్ట్ ఓకె చెయ్యాలన్నా దానికి భాష సమస్య కానే కాదు. కథలో జీవం ఉందా లేదా.. ఆ కథకు నేను సెట్‌ అవుతానా.. అసలు ఆ సినిమాలో నేను పాత్రకు న్యాయం చేయగలనా.. ఏదైనా ప్రాజెక్ట్‌ ఓకే చేసే ముందు ఇలా నన్ను నేను ప్రశ్నించుకుంటాను.. ఇక బాలీవుడ్ లో మంచి స్క్రిప్ట్ దొరికితే అక్కడ తప్పక సినిమా చేస్తాను అంటూ బాలీవుడ్ ఎంట్రీ పై సమంత ఫుల్ గా క్లారిటీ చేసింది. 

Samantha Full Clarity on Bollywood Entry:

Samantha reacts to the rumours of her bollywood debut entry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ