కరోనా సెకండ్ వేవ్ తగ్గింది.. ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. సెకండ్ వేవ్ టైం లో లాక్ డౌన్ పటిష్ఠంగా అమలు చెయ్యడంతో.. కరోనా తగ్గుముఖం పట్టగా.. మళ్ళీ మూడో వేవ్ సూచనలు మొదలైపోయాయి. అక్కడక్కడా కరోనా మళ్ళీ పుంజుకుంటుంది. రీసెంట్ గా ఏజెంట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కరోనా బారిన పడగ.. ఇప్పుడు తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ కరోనా బారిన పడ్డారు. విక్రమ్ షూటింగ్ లో బిజీగా వున్న కమల్ హాసన్ కి కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయినట్లుగా కమల్ హాసన్ ట్వీట్ చేసారు.
అయితే ఐసోలేషన్ లో కమల్ హాసన్ కరోనా చికిత్స తీసుకుంటున్నట్టుగా స్వయానా కమల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురైనట్టు.. అనుమానంగా ఉంది కరోనా పరీక్ష చేయించుకుంటే కరోనా పాజిటివ్‌గా తేలినట్టుగా కమల్ ట్వీట్ లో తెలిపారు. అయితే కమల్ హాసన్ హాస్పిటల్ లో ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టుగా సమాచారం. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కమల్ పిలుపునిచ్చారు. కమల్ హాసన్ కి కరోనా అని తెలియడంతో లోకేష్ కనకరాజ్.. విక్రమ్ షూటింగ్ ని ఆపేసినట్లుగా తెలుస్తుంది.