Advertisementt

సోగ్గాడు వచ్చేసాడు

Tue 23rd Nov 2021 10:56 AM
naga chaitanya,naga chaitanya birthday special,bangarraju teaser,bangarraju movie,nagarjuna,ramyakrishna,kalyan krishna,krithi shetty  సోగ్గాడు వచ్చేసాడు
Bangarraju Teaser Released సోగ్గాడు వచ్చేసాడు
Advertisement
Ads by CJ

కళ్యాణ్ కృష్ణ - నాగార్జున కాంబోలో సోగ్గాడే చిన్ననాయన సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికి తెలుసు. నాగార్జున డ్యూయెల్ రోల్ లో తండ్రి కొడుకులుగా కనిపించిన సోగ్గాడే చిన్ననాయన సినిమాలో నాగార్జున పంచె కట్టు, వాసివాడి తస్సాదియ్యా డైలాగ్స్, ఆయన రొమాంటిక్ యాంగిల్ అన్ని అదరగొట్టెయ్యడంతో.. సినిమా కూడా అంతే హిట్ అయ్యింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా నాగార్జున బంగార్రాజు సినిమాని అదే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున - నాగ చైతన్య కలిసి నటిస్తున్నారు. మరి తాత మనవళ్లుగానా? లేదంటే తండ్రి కొడుకులుగానా అనేది క్లారిటీ లేకపోయినా.. బంగార్రాజుగా నాగార్జున అదే పంచె కట్టుని ఫాలో అయితే.. చైతు మాత్రం సోగ్గాడి మాదిరి.. మేడలో గొలుసులు, చేతికి కడియం, వాచ్, చేతిలో కర్ర.. సోగ్గాడు వాడిన బులెట్ తో కనిపిస్తున్నాడు.

నాగ చైతన్య బర్త్ డే స్పెషల్ గా బంగార్రాజు నుండి టీజర్ రిలీజ్ చేసారు. నాగ చైతన్య సోగ్గాడు మాదిరి బిల్డప్ ఇచ్చాడు. చాలా స్టైలిష్ గా అచ్చం సోగ్గాడు గా నాగ చైతన్య లుక్, ఆయన డ్రెస్, అలాగే స్టయిల్ అన్ని అదిరిపోయాయి.. నాగ చైతన్యకి పర్ఫెక్ట్ బర్త్ డే గిఫ్ట్ బంగార్రాజు నుండి వచ్చేసింది. ఈ సినిమాలో చైతు కి జోడిగా నాగలక్ష్మి పాత్రలో కృతి శెట్టి కనిపించబోతుంది.  నాగ చైతన్య పల్లెటూరి సోగ్గాడి గెటప్ కి, కృతి శెట్టి నాగలక్ష్మి పల్లెటూరి గెటప్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అనేలా ఉంది. 

Bangarraju Teaser Released:

Naga Chaitanya Birthday Special: Bangarraju Teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ