బిగ్ బాస్ సీజన్ 5 లో గత రాత్రి అంటే సోమవారం రాత్రి బిగ్ బాస్ నామినేషన్స్ హీట్ ఇంకా ఈ రోజు కూడా కొనసాగేలా కనిపిస్తుంది. శ్రీరామ్ చంద్ర - కాజల్ మధ్యన మాటల యుద్ధం చల్లారలేదు. సన్నీ రవిని, శ్రీరామ్ కాజల్ ని ఏసుకోగా.. కాజల్ కి శ్రీరామ్ కి ఈ నామినేషన్స్ టాస్క్ లో గట్టి గొడవ జరిగింది. ఈ వారం హౌస్ లో ఉన్నవారంతా కెప్టెన్ మానస్ మినహా అందరూ నామినేట్ అయ్యారు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో నియంత మాటే శాసనం.. నియంత సింహాసనం మీద ఎవరు కూర్చుంటారో వారు ఆ రౌండ్ లో సేఫ్ అవుతారు. ఫస్ట్ రౌండ్ లో సిరి నియంత సింహాసనంలో కూర్చుని.. చెప్పండ్రా అమ్మాయిలు, అబ్బాయిలు, వాట్ టు డు, వాట్ నాట్ టు డు అంటూ కామెడీ చేసింది.
తర్వాత మిగతా ఇంటి సభ్యులు వారిని వారు సేవ్ చేసుకోవడానికి మరో ఛాలెంజ్ లో పాల్గొనవలసి ఉంటుంది. ప్రతి రౌండ్ లో బోటం టు గా నిలిచిన సభ్యులు.. సింహాసనం మీద కూర్చున్న నియంతని వారినుంచి ఒకరిని సేవ్ చెయ్యమని, తగిన కారణాలు చెప్పి ఒప్పించాల్సి ఉంటుంది. నియంత సింహాసనం మీద కూర్చున్న శ్రీరామ్ చంద్ర కాజల్ ని ఓ సింపుల్ క్వచ్చన్ అడుగుతాను అంటూ.. నువ్వు స్టార్ చేసావ్ కదా.. కెప్టెన్ అయితే నువ్ ఏం చేసేదానివి.. మళ్ళీ శ్రీరామ్ చంద్ర ఇద్దరి ఫొటోస్ ఉంటే నువ్ ఎవరిని కెప్టెన్ చేస్తావ్ అంటూ ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాపిక్ ఎత్తి కాజల్ ని కార్నర్ చేసాడు.. అక్కడ కాజల్ - శ్రీరామ్ గొడవ పడినట్లుగా చూపించారు ఈ రోజు ప్రోమోలో..