ఈ రోజు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బర్త్ డే.. ఆయనకి ఇండస్ట్రీ నుండి హీరోలు, ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే అనిల్ రావిపూడి తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న F3 మూవీ సీక్రెట్స్ ని తన బర్త్ డే సందర్భంగా బయటపెట్టాడు. వెంకీ - వరుణ్ కాంబోలో F2 కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న F3 మూవీ పాన్ ఇండియా మూవీ అని, ఈ సినిమా అన్ని భాషల్లో ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని అసలు సంక్రాంతి బరిలో నిలుద్దామనుకున్నామని , కానీ సోలోగా వస్తే బావుంటుంది అని దిల్ రాజుగారు నేను భావించామని చెప్పిన అనిల్ రావిపూడి F3 లోని చాలా సీక్రెట్స్ ని రివీల్ చేసారు.
అందులో ముఖ్యంగా వెంకటేష్ ఇందులో రేచీకటి పాత్రలో కామెడీ పండించబోతున్నారని, వరుణ్ తేజ్ నత్తి తో కామెడీ పండించడమే కాకుండా.. వెంకీ - వరుణ్ కాంబో సీన్స్ ఫుల్ ఫన్ తో కూడుకున్నవిగా ఉంటాయని, వారి కామెడీకి థియేటర్స్ లో ప్రేక్షకులు పడి పడి నవ్వుకుంటారు అని చెప్పిన అనిల్ రావిపూడి ఎఫ్ 3 తరువాత కూడా ఈ ఫ్రాంఛైజీ కొనసాగుతుంది అని చెప్పాడు. ఇక టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితోను తనకి సినిమాలు చేయాలనుంది అంటూ తన కోరికని బయటపెట్టాడు.
ఇక F3 హీరోలైన వరుణ్ తేజ్, వెంకటేష్ లు అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెప్పారు.
వరుణ్ తేజ్: Brooooooo!!! Happy birthday!! Wishing you loads of happiness and success..Be happy and keep smiling like you always do!🤗
వెంకటేష్: Happy birthday @AnilRavipudi! Its always a lot of fun on sets with you. Wishing you good health, prosperity and laughter.