బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకి చేరుకుంది. మరో నెల రోజుల్లో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి సిద్దమవుతుంది. ఈ వారం లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ లో కంటెస్టెంట్స్ హోరా హోరీగా పోటీ పడుతున్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. రవి, సిరి, కాజల్, షణ్ముఖ్, సన్నీ, ప్రియాంక, శ్రీరామ్ లు నామినేట్ అయ్యారు. సోమవారం జరిగిన నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ అంతా ఒకరి మీద ఒకరు గొడవ పడి నామినేట్ చేసుకున్నారు. అయితే ఈ వారం మానస్ కెప్టెన్ గా సేవ్ అవ్వగా, సన్నీ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉంది. సో వారిద్దరూ సేఫ్. ఇక ఓట్స్ పరంగా రవి, శ్రీరామ్ చంద్రలు పోటీ పడుతుండగా. షణ్ముఖ్ బయట ఫాన్స్ అండతో ఫైనల్ వరకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
బిగ్ బాస్ హౌస్ లో గొడవలకు కారణమవుతున్న కాజల్ రెండు వారాల ముందే ఇంట్లో నుండి బయటికి వెళ్ళాల్సింది. జెస్సి పుణ్యమా బ్రతికిపోయింది. ఇక ఈ వారం కాజల్ కూడా సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక చివరికి ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నది సిరి ఇంకా, ప్రియాంకనే అంటున్నారు. సిరి షణ్ముఖ్ కలిసి హౌస్ లో చేసే రచ్చ తప్ప.. టాస్క్ ల పరంగా సిరి ఆడినా హైలెట్ అవ్వడం లేదంటున్నారు. ఇక గేమ్ పరంగా, టాస్క్ ల పరంగా వీక్ గా వున్న ప్రియాంక మానస్ విషయంలో బాగా ఎమోషనల్ గా ఉంటుంది. మానస్ కి సేవలు చెయ్యడం, అందంగా రెడీ అవ్వడం తప్ప ప్రియాంక బిగ్ బాస్ హౌస్ లో ఉండి చేసింది ఏం లేదు.. ఇప్పటివరకు కొంతమంది వలన సేవ్ అవుతూ వచ్చిన ప్రియాంక ఈసారి ఎలిమినేట్ అవడం ఖాయమంటున్నారు. చూద్దాం ఫైనల్ గా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది.