జబర్దస్త్ కామెడీ షోస్ కి రెండు కళ్ళులా గ్లామర్ యాంకర్స్ గా బుల్లితెర మీద రఫ్ ఆడిస్తున్న రష్మీ గౌతమ్, అనసూయ భరద్వాజ్ లు.. అటు వెండితెర మీద అవకాశాలతోను జోరు చూపిస్తున్నారు. రష్మీ కన్నా ఎక్కువగా అనసూయ వెండితెర మీద దూసుకుపోతుంది. కీలక పాత్రల్లోనూ, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తోనూ అనసూయ వెండితెర డైరీ ఫుల్. ఇక రష్మీ కొంతకాలంగా వెండితెరకు కాస్త దూరంగానే ఉంటుంది.. బుల్లితెరమీద ఢీ డాన్స్ షో, జబర్దస్త్ ఆల్టో అదరగొడుతున్న రష్మీకి చిరు భోళా శంకర్ లో ఓ స్పెషల్ సాంగ్ అవకాశం వచ్చింది అనే న్యూస్ నడుస్తుంది.
చిరంజీవి - కీర్తి సురేష్ అన్నా చెల్లెళ్లుగా, తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రష్మీ ఐటెం సాంగ్ దాదాపు ఖరారు అయినట్లే అంటున్నారు. మరో జబర్దస్త్ భామ అనసూయ చిరు గాడ్ ఫాదర్ లో కీ రోల్ లో నటిస్తుంది. సో జబర్దస్త్ భామలైన అనసూయ, రష్మీ లతో చిరు అటు భోళా శంకర్, ఇటు గాడ్ ఫాదర్ మూవీస్ లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇక అనసూయ పుష్ప మూవీలో దాక్షాయణిగా మాస్ గా అదరగొట్టేస్తుంది. అలాగే ఖిలాడీ, ఇంకా అనసూయ కీ రోల్ లో మరో సినిమా ఉంది. ఇలా అనసూయ చేతినిండా సినిమాలే. ఇక రష్మీ కి భోళా శంకర్ ఐటెం సాంగ్ మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందో చూద్దాం.