బిగ్ బాస్ సీజన్ 5 12 వ వారం పూర్తి చేసుకోబోతుంది. హౌస్ లో ఇంకా ఎనిమిదిమంది కంటెస్టెంట్స్ ఉన్నారు. టాప్ లో రకరాల పేర్లు వినిపిస్తున్నా,.. రోజు రోజుకి ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. అంటే నామినేషన్స్ తర్వాత డేంజర్ జోన్ లో ఉన్నవారు.. ఎలిమినేషన్స్ కి వచ్చేసరికి.. సేఫ్ అయ్యి.. వేరొకరు ఎలిమినేట్ అయ్యేలా ఉంటుంది. ఓటింగ్స్ తో పాటుగా మిస్సిడ్ కాల్ డేట్ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్స్ లో కీలక పాత్ర వహిస్తుంది.. అయితే ప్రస్తుతం ఎనిమిదిమందిలో ఒక్క కెప్టెన్ మానస్ తప్ప మిగతా ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఈ వారం హౌస్ లో లాస్ట్ కెప్టెన్సీని షణ్ముఖ్ జస్వంత్ చేజిక్కించుకున్నాడు.
అలాగే లగ్జరీ బడ్జెట్ టాస్క్ కూడా ఈరోజు జరిగింది. అయితే బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశలో ఉండడంతో.. హౌస్ లోకి కంటెస్టెంట్స్ కుటుంబ సబ్యులని పంపింది స్టార్ మా. అందులో ముందుగా కాజల్ కూతురు ఆమె భర్త ఎంట్రీ ఇవ్వగా.. కాజల్ ని ఫ్రీజ్ చేసారు బిగ్ బాస్.. మమ్మీ అంటూ కాజల్ కూతురు హౌస్ లో సందడి చెయ్యగా.. శ్రీరామా చంద్ర మీ మామ్ ని నామినేట్ చేస్తే మా మీద కోపం వస్తుందా అనగా.. వస్తుంది అని చెప్పింది. ఇక శ్రీరామ్ చంద్ర ఇంటినుండి కూడా ఆయన ఇంటి సభ్యులు రాగా.. షణ్ముఖ్ మాత్రం.. సర్ బిగ్ బాస్ నా ఫ్యామిలీ నుండి ఎవరిని పంపుతారో.. చెప్పండి అంటూ తెగ టెంక్షన్ పడుతున్నాడు. హౌస్ కి లాస్ట్ కెప్టెన్ అయినా షణ్ముఖ్ పేస్ లో టెంక్షన్.
మరి షణ్ముఖ్ కోసం ఆయన గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన రావొచ్చనే ఊహాగానాలకు షణ్ముఖ్ టెంక్షన్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.. సో షన్ను కోసం ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ వస్తారో.. లేదంటే దీప్తి సునయన వస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.